ఈ 5 నెలల్లో పుట్టినవారికి ఆత్మాభిమానం ఎక్కువ.. ఎవ్వరిముందు తలవంచరు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఆలోచనా విధానం, ఆత్మాభిమానం, ఉన్నత దృష్టి వంటి వాటిపై పుట్టిన నెల ప్రభావం ఉంటుంది. కొన్ని నెలల్లో జన్మించిన వారికి ఆత్మాభిమానం ఎక్కువ. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా.. వీరు ఎవ్వరి ముందు తలవంచడానికి ఇష్టపడరు.

Birth Month Astrology
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనిషి స్వభావంపై పుట్టిన రాశితో పాటు నెల కూడా ప్రభావం చూపిస్తుంది. కొన్ని నెలల్లో పుట్టిన వారికి ఆత్మాభిమానం మెండుగా ఉంటుంది. వారి నిర్ణయాలు, విలువలు, ఆలోచనలను ఎవరి కోసం మార్చుకోరు. తమ విలువలకు విరుద్ధంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. మరి ఏ నెలల్లో పుట్టినవారు ఇతరుల ముందు తలవంచరో ఇక్కడ తెలుసుకుందాం.
జనవరి
జనవరి నెలలో పుట్టినవారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో పుట్టినవారు క్రమశిక్షణ, బాధ్యత, గంభీరత, ఆత్మగౌరవానికి ప్రసిద్ధి. వీరు ఎంత కష్టమైన పరిస్థితులు వచ్చినా గౌరవాన్ని కోల్పోరు. ఎదుటి వ్యక్తి ఎంత బలంగా ఉన్నా వీరు తలవంచరు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక.. దాన్ని ఎట్టిపరిస్థితుల్లో మార్చుకోరు.
ఏప్రిల్
ఏప్రిల్ నెల కుజగ్రహానికి సంబంధించింది. అందుకే ఈ నెలలో పుట్టినవారు ఉత్సాహవంతులు. వేగంగా నిర్ణయం తీసుకుంటారు. ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటారు. తమ గౌరవానికి చిన్న గీత పడినా తీవ్రంగా స్పందిస్తారు. అయితే వీరి ఆత్మాభిమానం బయటకు అహంకారంలా కనిపించినా.. లోపల మాత్రం వీరు న్యాయంగా, నిజాయతీగా ఉంటారు.
ఆగస్టు
ఆగస్టు నెలపై సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో పుట్టినవారి వ్యక్తిత్వంలో శోభ, రాజసం కనిపిస్తుంది. వీరికి ఆత్మాభిమానం ఎక్కువ. ఎదుటివారి అణచివేత ఏ రూపంలో ఉన్నా వీరు ఒప్పుకోరు. సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండటం వీరి ప్రత్యేకత.
అక్టోబర్
శుక్రుడి అధీనంలో ఉన్న నెల అక్టోబర్. ఈ నెలలో జన్మించినవారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మృదువుగా మాట్లాడినా, వీరికి ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది. సంబంధాలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు కానీ, గౌరవం తగ్గే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం దూరం కావడానికైనా వెనుకాడరు. ఇతరుల ముందు తలవంచడానికి వీరు అస్సలు ఒప్పుకోరు.
డిసెంబర్
డిసెంబర్ నెలపై గురు గ్రహ ప్రభావం ఎక్కువ. ఈ నెలలో పుట్టినవారు పెద్ద మనసు, ధైర్యం, నిజాయతీ, స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తారు. వీరి ఆత్మాభిమానం చాలా స్వచ్ఛమైనది. అహంకారం కాదు. వారిది తప్పు అయితే కచ్చితంగా ఒప్పుకుంటారు. కానీ అన్యాయం ఎదురైతే మాత్రం అడ్డంగా నిలబడతారు. తాము ఎంచుకున్న దారిలోనే నడవాలనే దృఢ సంకల్పం వీరి ప్రత్యేకత.
