Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారు వ్యాపారాల్లో బాగా రాణించగలరు..!
Birth Stars:వ్యాపారం అంటే ధైర్యం, నిర్ణయం, మనోబలం, కమ్యూనికేషన్ స్కిల్స్, రిస్క్ తీసుకునే సామర్థ్యం. ఆశ్చర్యంగా అనిపించినా, ఇలాంటి లక్షణాలు కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారికి పుట్టుకతోనే వచ్చేస్తాయి. వారు వ్యాపారం చేస్తే, ఎక్కువ లాభాలు పొందగలరు.

వ్యాపారాల్లో రాణించగల నక్షత్రాలు...
1.అశ్విని నక్షత్రం....
అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. రిస్క్ తీసుకోవడంలో వీరు ఎప్పుడూ భయపడరు. ధైర్యంగా నిలపడతారు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు వ్యాపారంలో బాగా రాణించగలరు. ఫాస్ట్ గ్రోత్, న్యూ స్టార్టప్, మార్కెటింగ్, హెల్త్ అండ్ ఫిట్‌నెస్, ట్రావెల్ వంటి వ్యాపారాలు ఎంచుకుంటే మంచి లాభాలు పొందుతారు.
2.భరణి నక్షత్రం...
భరణి నక్షత్రంలో పుట్టిన వారు చాలా క్రమశిక్షణతో ఉంటారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలపడగల సత్తా వీరిలో ఉంటుంది. వీరు చాలా బాగా మాట్లాడగలరు. వ్యాపారాల్లోనూ వీరు చాలా బాగా రాణించగలరు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు రియల్ ఎస్టేట్, కన్ స్ట్రక్షన్ వంటి రంగాల్లో సత్తా చాటగలరు.
3.రోహిణీ నక్షత్రం...
రోహిణీ నక్షత్రంలో పుట్టిన వారు సహజంగా చాలా ఆకర్షణీయంగా ఉంటారు. చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తారు. వీరికి మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా వీరికి ఎక్కువ. లగ్జరీ,మీడియా, బ్యూటీ, ఫ్యాషన్, హోటల్ ఇండస్ట్రీ వంటి రంగాల్లో వ్యాపారం ఎంచుకుంటే... సత్తా చాటగలరు.
4.మృగశిర నక్షత్రం...
మృగశిర నక్షత్రంలో పుట్టిన వారు కూడా వ్యాపారాల్లో బాగా రాణించగలరు. రీసెర్చ్, ప్లానింగ్, అనలిటికల్ థింకింగ్ ఈ నక్షత్రం లో పుట్టిన వారికి చాలా ఎక్కువ. కస్టమర్ మైండ్ ని వీరు చాలా బాగా అర్థం చేసుకోగలరు. వీరు మార్కెట్ రీసెర్చ్, ఎడ్యుకేషన్, ట్రేడింగ్ లాంటి వ్యాపారాలు ఎంచుకుంటే బాగా రాణించగలరు.
5.పునర్వసు నక్షత్రం...
ఈ నక్షత్రంలో పుట్టిన వారు కూడా వ్యాపారాల్లో బాగా సత్తా చాటగలరు. వీరికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. వ్యాపారాన్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలరు. ఇన్నోవేషన్, టెక్నాలజీ, ఈ-కామర్స్ లాంటివి ఎంచుకుంటే ఎక్కువ లాభాలు పొందుతారు.
6. మఖ నక్షత్రం
నాయకత్వం ఈ నక్షత్రంలో పుట్టినవారికి సహజం. టీమ్‌ను నడిపించడం, పెద్ద బిజినెస్‌లు మేనేజ్ చేయడం వీరు ముందుంటారు.
7. హస్త నక్షత్రం
హస్తలో పుట్టినవారికి చేతి పనులలో అద్భుతమైన నైపుణ్యం ఉంటుంది. లాజిక్ + క్రియేటివిటీ కలయిక వీరికి ప్రత్యేకత.
సూటయిన బిజినెస్‌లు: ప్రింటింగ్, డిజైనింగ్, క్రాఫ్ట్స్, డిజిటల్ మార్కెటింగ్.
8. స్వాతి నక్షత్రం
‘స్వతంత్రత’ అంటే స్వాతి. స్వతంత్రంగా వ్యాపారం చేయడం వీరి కి బాగా ఇష్టం. కమ్యూనికేషన్ స్కిల్ బలంగా ఉంటుంది.
సూటయిన బిజినెస్‌లు: ఇంపోర్ట్-ఎక్స్‌పోర్ట్, ట్రావెల్, అడ్వర్టైజింగ్.
9. ధనిష్ఠ నక్షత్రం
ప్లానింగ్, ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ మీద మంచి పట్టు ఉంటుంది. డబ్బు వృద్ధి చేయడంలో వీరు నిపుణులు.
సూటయిన బిజినెస్‌లు: రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, ఫైనాన్స్.
10. శతభిష నక్షత్రం
స్వతంత్ర ఆలోచనలు, రీసెర్చ్, టెక్నికల్ పరిజ్ఞానం ఎక్కువ. కొత్త పద్ధతుల్లో బిజినెస్‌ను నడపగలరు.

