- Home
- Astrology
- Surya Gochar: నక్షత్రం మార్చుకుంటున్న సూర్యుడు.. ఆగస్టు3 తర్వాత మూడు రాశులకు రాజయోగం పక్కా
Surya Gochar: నక్షత్రం మార్చుకుంటున్న సూర్యుడు.. ఆగస్టు3 తర్వాత మూడు రాశులకు రాజయోగం పక్కా
ఆగస్టు 3వ తేదీన ఉదయం 4: 16 గంటలకు సూర్యుడు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 30వ తేదీ వరకు అదే నక్షత్రంలో ఉంటాడు.

surya gochar
సూర్యుడిని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. జోతిష్యశాస్త్రంలో అందుకే సూర్యుడి కి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఇది శుభ గ్రహం. దాని ప్రతి సంచారం దాదాపు అన్ని రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఎవరి జాతకంలో అయితే.. సూర్యుడు బలంగా ఉంటాడో.. వారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. వారికి సమాజంలో మంచి పేరు, మంచి ఆరోగ్యం లభిస్తాయి. అంతేకాకుండా.. వారు చేసే ప్రతి పనిలోనూ అదృష్టం కూడా తోడు అవుతుంది. విజయ అవకాశాలు కూడా పెరుగుతాయి.
వచ్చే నెల అంటే ఆగస్టు 3వ తేదీన ఉదయం 4: 16 గంటలకు సూర్యుడు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 30వ తేదీ వరకు అదే నక్షత్రంలో ఉంటాడు. ఆ తర్వాత పూర్వ ఫాల్గుణి నక్షత్రంలోకి అడుగుపెడతాడు.అదేవిధంగా ఈ సింహ రాశి ఆగస్టు 17వ తేదీన సింహ రాశిలో సంచరిస్తాడు. దీని కారణంగా ఈ ఆగస్టు నెల మొత్తం మూడు రాశులకు చాలా మంచి జరగనుంది.ముఖ్యంగా రాజయోగం వరించనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దామా....
వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారికి ఆగస్టు నెలలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారం చేసేవారు అయితే.. గతం పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు మంచి రాబడి వస్తుంది. పారిశ్రామిక వేత్తలకు వారి ప్రత్యర్థుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారం మరింత విస్తరించే అవకాశం ఉంది. పెళ్లి కాని వారికి ఈ సమయంలో పెళ్లి జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వారు కోరుకున్న వ్యక్తి జీవితంలోకి అడుగుపెడతారు. అయితే, తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. ఆల్రెడీ పెళ్లైన వారి జీవితం కూడా ఆనందంగా మారుతుంది.
తుల రాశి...
తుల రాశి వారికి ఆగస్టు నెలలో సూర్యుని సంచారం కారణంగా చాలా ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. వారు కోరుకున్నది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దుకాణదారులు ఎక్కువ లాభం పొందుతారు. వారు సమాజంలో కీర్తిని పొందుతారు. దీనితో పాటు, తులారాశి వారికి చర్మ సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సింహ రాశి..
ఆగస్టు నెలలో, సూర్య దేవుడు సింహరాశిలో సంచారము చేస్తాడు, ఇది వారికి శుభప్రదం.అన్ని శుభాలు ఈ రాశివారికి జరిగే అవకాశం ఉంది. యువతలో విశ్వాసం పెరుగుతుంది, మరోవైపు, ఉద్యోగుల వ్యక్తిత్వం మెరుగుపడే అవకాశం ఉంది. దీనితో పాటు, వ్యాపారుల వ్యాపారం ఊపందుకుంటుంది. పాత నష్టాలు భర్తీ చేయగలరు. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.