Astro remedies: ఇంట్లో డబ్బు సమస్యా..? కుటుంబంలో సమస్యలా? ఇదొక్కటి చేస్తే చాలు
బిర్యానీ ఆకు దంపతుల మధ్య సమస్యలను తగ్గించి, వారి బంధాన్ని బలోపేతం చేయడంలో సహాయం చేస్తుంది. వారి మధ్య ప్రేమ పెరగడానికి కూడా కారణం అవుతుంది.ఆర్థిక శ్రేయస్సును కూడా తీసుకువస్తుంది.

జీవితంలో సమస్యలు లేనివారు ఎవరూ ఉండరు. కొందరికి డబ్బు సమస్యలు ఉంటే.. మరి కొందరికి కుటుంబ సభ్యులు ఇలా ఏదో ఒకటి ఉండటం చాలా కామన్. మీరు కూడా ఇలాంటి సమస్యలతోనే బాధపడుతున్నారా? ముఖ్యంగా ఎంత సంపాదించినా.. ఇంట్లో డబ్బు నిలవడం లేదా? అయితే.. జోతిష్యశాస్త్రం ప్రకారం మీరు కొన్ని రకాల రెమిడీలు ఫాలో అయితే చాలు. మీ ఆర్థిక సమస్యలన్నీ తగ్గిపోవడం ఖాయం. మరి అవేంటో తెలుసుకుందామా..
మన కిచెన్ లో లభించే చాలా వస్తువులు.. మన ఎన్నో రకాల సమస్యలను తగ్గించేస్తాయి. ఈ విషయాలు చాలా మందికి తెలీదు. మనం రెగ్యులర్ గా ఇంట్లో బిర్యానీ తింటూనే ఉంటాం. ఆ బిర్యానీ చేయడానికి వాడే అతి ముఖ్యమైనది బిర్యానీ ఆకు. ఇది లేకపోతే దానికి రుచే లేదు. ఈ బిర్యానీ ఆకు వంటకు రుచిని తేవడమే కాదు.. మీ ఆర్థిక, కుటుంబ, వైవాహిక సమస్యలను కూడా తగ్గిస్తుంది.కాకపోతే ఆ బిర్యానీ ఆకును ఎలా వాడాలో మాత్రం కచ్చితంగా తెలిసి ఉండాలి.బిర్యానీ ఆకు దంపతుల మధ్య సమస్యలను తగ్గించి, వారి బంధాన్ని బలోపేతం చేయడంలో సహాయం చేస్తుంది. వారి మధ్య ప్రేమ పెరగడానికి కూడా కారణం అవుతుంది.ఆర్థిక శ్రేయస్సును కూడా తీసుకువస్తుంది.
ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి...
మీరు ఇంట్లో ఎప్పుడూ సమస్యలతో సతమతమౌతున్నారా? కుటుంబ సభ్యుల మధ్య గొడవ కారణంగా మనశ్శాంతి కోల్పోతున్నారా? అయితే.. మీరు రాత్రి పడుకునే ముందు దిండు కింద రెండు బిర్యానీ ఆకులను పెట్టుకుంటే చాలు. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో శాంతి నెలకుంటుంది.
దంపతుల మధ్య ప్రేమ పెరగాలంటే..
మీకు, మీ జీవిత భాగస్వామి మధ్య ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఒకరికి మరొకరిపై ప్రేమ తగ్గిపోయిందా.. మళ్లీ.. ఆ ప్రేమ పెరగాలంటే కూడా మీరు ఈ బిర్యానీ ఆకులను వాడితే చాలు. మీరు రెండు బిర్యానీ ఆకులు తీసుకోండి. ఒకదానిపై మీ పేరు, మరో దానిపై మీ భాగస్వామి పేరు రాయండి. మీ పేరు రాసిన ఆకును మీ భాగస్వామి దిండు కింద, వారి పేరు రాసిన ఆకు మీ దిండు కింద పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ మధ్య ప్రేమ మళ్లీ చిగరిస్తుంది.మీ బంధం బలపడుతుంది.
ఆర్థిక సమస్యలు తీరాలంటే...
మీకు ఆర్థిక సమస్యలు ఉంటే, వాటిని పోగొట్టాలంటే కూడా బిర్యానీ ఆకు వాడొచ్చు. మూడు బిర్యానీ ఆఖులను తీసుకొని వాటిని ఆకుపచ్చ దారంతో కట్టాలి. వీటిని.. మీరు ఇంట్లో డబ్బులు దాచే లాకర్ లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు కచ్చితంగా తీరిపోతాయి.
తీరని కోరికలు ఉన్నాయా?
ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కోరిక ఉంటుంది. మీ కోరిక కూడా ఎప్పటికీ తీరడం లేదా? అయితే.. బిర్యానీ ఆకు పై మీకోరిక రాయాలి. దాని చుట్టూ కర్పూరం చుట్టి, నిప్పు వెలిగించాలి. అది ఎంత తొందరగా నిప్పుల్లో కాలితే, మీ కోరిక అంత తొందరగా నిజమౌతుంది.