పొరపాటున కూడా ఈ వస్తువులు ఎవరి దగ్గరా అరువు తీసుకోకండి..!
కొన్ని వస్తువులను ఎవరి దగ్గరా అరువు అంటే... అప్పుగా తీసుకోకూడదట. అలా అప్పుగా తీసుకోవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని జోతిష్యశాస్త్రం చెబుతోంది.
మన ఫ్రెండ్ లేదంటే సిస్టర్ , బ్రదర్ దగ్గర మనకు కావాల్సిన వస్తువులు ఉంటే మనం ఏం చేస్తాం. వెంటనే నేను ఒక్కసారి వాడుకొని ఇచ్చేస్తాను అని తీసేసుకుంటాం. వాళ్లు కూడా మన వాళ్లే కాబట్టి అడగ్గానే ఇచ్చేస్తారు. కానీ జోతిష్యశాస్త్రం ప్రకారం.. కొన్ని వస్తువులను ఎవరి దగ్గరా అరువు అంటే... అప్పుగా తీసుకోకూడదట. అలా అప్పుగా తీసుకోవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని జోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ వస్తువులు ఏంటో ఓసారి చూద్దాం..
1.దుస్తులు..
మనం కామన్ గా తెలియక చేసే తప్పు ఇది. మన మన ఫ్రెండ్స్ దగ్గర, బంధువుల దగ్గర నుంచి డ్రెస్, చీరలు లాంటివి తీసుకొని వేసుకుంటాం. ఫంక్షన్ తర్వాత మళ్లీ తిరిగి ఇచ్చేస్తామని అరువు గా తీసుకుంటారు. కానీ... ఆ పొరపాటు చేయకూడదని .జోతిష్యశాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల.. మీలో ఉన్న పాజిటివీ ఎనర్జీ పోయి... మీరు ఎవరి దుస్తులు వేసుకుంటున్నారో వాళ్ల నెగిటివ్ ఎనర్జీ మీకు వస్తుంది. దాని వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దురదృష్టం వెంటాడుతుంది.
2.చెప్పులు..
కామన్ గా మనం చేసే మరో పొరపాటు ఇది. సైజు సరిపోతే చాలు... ఇతరుల చెప్పులు, షూలు వేసుకోవడానికి ఇష్టపడతారు. అడిగి మరీ తీసుకొని వేసుకుంటూ ఉంటారు. కానీ.. దాని వల్ల షని దోషాలు వస్తాయట. అంటే... డబ్బు కు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. ఎంత సంపాదించినా రూపాయి కూడా మిగలదు. అందుకే.. ఒకరి చెప్పులు , షూలు మరొకరితో షేర్ చేసుకోకూడదు.
Pen set
3.పెన్..
మన దగ్గర రెండు పెన్స్ ఉన్నాయి అంటే.. వెంటనే ఎవరైనా అడిగితే ఇచ్చేస్తూ ఉంటాం. కానీ.. ఆ పొరపాటు కూడా చేయకూడదని జోతిష్యశాస్త్రం చెబుతోంది. ఎందుకంటే.. పెన్ అనేది నాలెడ్జ్ కి సంబంధించిన విషయం... దీనిని ఎవరికైనా ఇవ్వడం వల్ల... మీకు ప్రొఫెషనల్ గా, వృత్తి పరంగా సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఇతరులతో షేర్ చేయకపోవడమే మంచిది.