శని ప్రభావంతో బాధపడుతున్నారా.? శనివారం ఇలా చేస్తే మీ సమస్యలన్నీ ఫసక్
Shani dev: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడు “కర్మఫల దాత”గా పరిగణిస్తారు. ఆయన అనుగ్రహం లభిస్తే జీవితం ఉజ్వలంగా మారుతుంది. కానీ జాతకంలో శని దోషం ఉంటే ఆరోగ్యం, ఆర్థిక స్థితి, సంబంధాలు, వృత్తి వంటి అంశాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శని ప్రభావం తగ్గాలంటే..

శనిదేవుని కృప పొందే పూజలు
శనివారం రోజున శనిదేవుని ఆలయానికి వెళ్లి భక్తిశ్రద్ధలతో పూజ చేయడం అత్యంత ఫలప్రదం. నెయ్యిలో దీపం వెలిగించి నల్ల నువ్వులు, నూనెతో నైవేద్యం సమర్పించడం శుభప్రదం. శనియంత్రం లేదా శని గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే మనసుకు శాంతి కలిగి దోష ప్రభావం తగ్గుతుంది.
శివుడు, హనుమంతుడు పట్ల భక్తి
శనిదోషం తగ్గించుకోవడానికి శివుడి, హనుమంతుడి పూజ చేయడం చాలా మంచిది. శివుని లింగ రూపానికి బిల్వపత్రాలతో అర్చన చేయడం, ఆవు పాలతో అభిషేకం చేయడం శ్రేయస్కరం. హనుమాన్ చాలీసా లేదా సుందర కాండ పారాయణం చేస్తే శని గ్రహం శాంతిస్తుంది.
దానం ద్వారా శాంతి
శనివారం రోజున లేనివారికి ఆహారం, వస్త్రాలు, ధనం వంటి దానాలు చేయడం శనిదేవుని సంతోషపరుస్తుంది. ముఖ్యంగా నల్ల దుస్తులు, నెయ్యి, శనగపిండి, నువ్వులు వంటి వస్తువులు దానం చేస్తే శుభఫలితాలు లభిస్తాయి. భగవంతుని అనుగ్రహం పొందడానికి ఇది అత్యంత సులభమైన మార్గం.
ఉపవాసం, స్నానం, మంత్రపఠనం
శనివారం ఉదయం త్వరగా లేచి తలస్నానం చేసి ఉపవాసం ఉండడం ఉత్తమం. తరువాత “ఓం శనైశ్చరాయ నమః” మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా క్రమంగా చేస్తే జీవితంలోని బాధలు, ఆటంకాలు తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
శని దోషం తగ్గించే ప్రత్యేక పద్ధతులు
* ప్రతిరోజు కాకులకు పప్పు, అన్నం ఇవ్వడం శనిదోషాన్ని తగ్గిస్తుంది.
* నీలిరాతి ఉంగరం ధరించడం శని ప్రభావాన్ని తగ్గించగలదని భక్తుల విశ్వాసం.
* ఆలయంలో నవగ్రహ పూజలు చేయించడం, శని మంత్ర జపం చేయడం వల్ల మంచి జరుగుతుంది.
* శనివారం సాయంత్రం సుందర కాండ పారాయణం లేదా హనుమాన్ భజనలు వినడం ద్వారా మనసు ప్రశాంతమవుతుంది.