- Home
- Business
- CNG కొట్టిచ్చేప్పుడు.. కారులో ఉన్న వారిని ఎందుకు కిందికి దించుతారో ఎప్పుడైనా ఆలోచించారా.?
CNG కొట్టిచ్చేప్పుడు.. కారులో ఉన్న వారిని ఎందుకు కిందికి దించుతారో ఎప్పుడైనా ఆలోచించారా.?
CNG: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కార్లకు సమానంగా సీఎన్‌జీ కార్లు రోడ్లపై తిరుగుతున్నాయి. ఇతర వాహనాలతో పోల్చితే సీఎన్‌జీ వెహికిల్స్‌లో ఫ్యూయల్ ఫిల్లింగ్ విధానం భిన్నంగా ఉంటుంది. కారులో ఉన్న ప్రయాణికులను కిందికి చూసే ఉంటారు. కారణం ఏంటంటే.?

కారులో ఎందుకు ఉండకూడదు?
పెట్రోల్ లేదా డీజిల్ నింపేటప్పుడు ప్రయాణికులు కారులోనే కూర్చుంటారు. కానీ CNG (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) నింపేటప్పుడు మాత్రం అందరూ కారులోనుంచి బయటికి రావాలి. ఇది సాధారణ నిబంధన కాదు — భద్రతకోసం చాలా కీలకమైన చర్య. CNG నిల్వ ఉండే ఒత్తిడి 200 నుంచి 250 బార్ వరకు ఉంటుంది, అంటే చాలా ఎక్కువ. ఈ సమయంలో వాహనంలో ఉన్నవారి బరువు కూడా వాహనం సస్పెన్షన్, సిలిండర్‌పై ఒత్తిడి పెంచుతుంది. అలా అయితే గ్యాస్ లీక్ కావడం లేదా పేలుడు సంభవించవచ్చు.
అధిక ఒత్తిడి, మంట ప్రమాదం
CNG చాలా సులభంగా మంట పట్టే ఇంధనం. కొద్దిగా లీక్ అయినా లేదా నాజిల్ సరిగ్గా జత కాకపోయినా అగ్ని ప్రమాదానికి కారణం అవుతుంది. అందుకే రీఫిల్లింగ్ సమయంలో ఇంజిన్ ఆఫ్ చేయడం, ప్రయాణికులు కారులోనుంచి బయటకు రావడం తప్పనిసరి. ఈ చిన్న జాగ్రత్తే పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతుంది.
వాసన వస్తే జాగ్రత్త
సహజంగా CNGకి వాసన ఉండదు. కానీ లీక్ గుర్తించడానికి అందులో ప్రత్యేక రసాయనం కలుపుతారు. అది బలమైన వాసన ఇస్తుంది. ఆ వాసన ఎక్కువగా పీల్చితే తలనొప్పి, తల తిరగడం, శ్వాస సమస్యలు రావచ్చు. కాబట్టి రీఫిల్లింగ్ సమయంలో బయట ఉండడం ఆరోగ్యపరంగా కూడా మంచిదే.
ఓవర్‌ఫిల్లింగ్ ప్రమాదం
ప్రతి CNG సిలిండర్‌కి ఒక నిర్దిష్ట సామర్థ్యం ఉంటుంది. చాలా మంది “రౌండ్ ఫిగర్‌కి నింపండి” అని చెబుతారు. కానీ అలా చేయడం వల్ల సిలిండర్‌లో ఒత్తిడి పెరిగి పగిలిపోవచ్చు. కాబట్టి ఎప్పుడూ ఆథరైజ్డ్ స్టేషన్లలో మాత్రమే నింపించండి, అదనంగా గ్యాస్ నింపమని అడగకండి.
భద్రత కోసం గుర్తుంచుకోవాల్సిన విషయాలు
* ఇంజిన్ ఆఫ్ చేసి రీఫిల్లింగ్ ప్రారంభించాలి
* డ్రైవర్ సహా అందరూ కారులోనుంచి బయటకు రావాలి
* నాజిల్ సరిగా జత అయ్యిందో చూడాలి
* మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించవద్దు
* ఆథరైజ్డ్ స్టేషన్‌లలోనే నింపించాలి
* ఓవర్‌ఫిల్లింగ్ చేయమని ఒత్తిడి చేయకండి