Shani Gochar : 30 ఏళ్ల తర్వాత అద్భుతం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే !
Shani Gochar : హోలీ తర్వాత మీన రాశిలో శని అస్తమయం కానుంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ మార్పుతో ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధనలాభం కలుగనున్నాయి. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

శనిదేవుడి కరుణ : వీరి జాతకంలో అనూహ్య మార్పులు.. డబ్బే డబ్బు !
జ్యోతిషశాస్త్రంలో కర్మ ప్రదాతగా, న్యాయాధిపతిగా శని దేవుడిని పరిగణిస్తారు. మనిషి చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇచ్చే గ్రహం శని. క్రమశిక్షణ, న్యాయం, బాధ్యతలకు శని ప్రతీకగా నిలుస్తాడు. ఈ గ్రహం ప్రభావం మానవ జీవితంలోని అనేక కీలకమైన రంగాలపై ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఆయుష్షు, అనారోగ్యం, జీవితంలో పోరాటం, సాంకేతిక రంగాలు, ఉద్యోగం, సేవా వర్గం, ఇనుము, నూనె వంటి అంశాలకు శని కారకత్వం వహిస్తాడు. అందుకే శని చలనంలో లేదా స్థితిలో చిన్న మార్పు వచ్చినా, ఈ రంగాలన్నింటిపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రస్తుతం శని గ్రహ కదలికలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోబోతోంది. దృక్ పంచాంగం ప్రకారం, హోలీ పండుగ ముగిసిన తర్వాత, అంటే 2026 మార్చి 13వ తేదీన సాయంత్రం 7:13 గంటలకు శని దేవుడు మీన రాశిలో అస్తమించనున్నాడు.
30 ఏళ్ల తర్వాత అరుదైన ఘట్టం
జ్యోతిష పండితుల ప్రకారం, దాదాపు 30 సంవత్సరాల తర్వాత శని దేవుడు ఇంత పెద్ద స్థితి మార్పును జరుపుకోబోతున్నాడు. మీన రాశిలో శని అస్తమయం జరగడం అనేది ఒక కీలకమైన పరిణామం. సాధారణంగా శని అస్తమయం ప్రభావం ద్వాదశ రాశులపైనా ఉంటుంది. అయితే, ఈసారి జరగబోయే ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారికి మాత్రం అదృష్టం వరించనుంది. ముఖ్యంగా ఉద్యోగం, సంపద, వ్యక్తిగత ప్రగతికి సంబంధించిన కొత్త అవకాశాలు ఈ రాశుల వారి తలుపు తట్టనున్నాయి. ఆ అదృష్ట రాశుల వివరాలు గమనిస్తే..
ధనుస్సు రాశి
మీన రాశిలో శని అస్తమయం ధనుస్సు రాశి వారికి అత్యంత శుభప్రదంగా మారనుంది. ఈ కాలంలో మీ జీవితంలో భౌతిక సుఖాలు, సౌకర్యాలు గణనీయంగా పెరుగుతాయి. ఇల్లు, వాహనం లేదా ఇతర ఆస్తులకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. అంతేకాకుండా, ఆర్థికంగా కొత్త మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది.
చాలా కాలంగా ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్న వారికి ఇది సరైన సమయం. మీకు మంచి ప్యాకేజీతో కూడిన అద్భుతమైన జాబ్ ఆఫర్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఆకస్మిక ధనలాభం కలిగే యోగం కూడా ఉంది. వ్యక్తిగత జీవితంలో, మీ తల్లితో మీకు ఉన్న అనుబంధం గతంలో కంటే మరింత బలంగా మారుతుంది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి శని అస్తమయం సానుకూల ఫలితాలను తీసుకురానుంది. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి ఈ సమయంలో ఊరట లభిస్తుంది. ఆర్థిక పరమైన విషయాల్లో ఒత్తిడి తగ్గి, ఆకస్మికంగా డబ్బు చేతికి అందే యోగం ఉంది. వ్యాపారస్తులకు ఎప్పటి నుంచో మార్కెట్లో నిలిచిపోయిన బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యంగా విద్య, మీడియా, సేల్స్ లేదా మార్కెటింగ్ రంగాల్లో పనిచేసే వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మీ మాటతీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. మీ ఆలోచనలు, ప్రణాళికలు పదిమందినీ ప్రభావితం చేస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
మీన రాశి
శని దేవుడు ఇదే రాశిలో అస్తమిస్తుండటంతో, మీన రాశి వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఈ కాలంలో మీ వ్యక్తిత్వం మరింతగా వెలిగిపోనుంది. తద్వారా సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ ఇమేజ్ మెరుగుపడటంతో పాటు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది.
వివాహితులకు దాంపత్య జీవితం మధురంగా మారుతుంది. మీ జీవిత భాగస్వామి వృత్తిపరంగా ప్రగతి సాధించే యోగం బలంగా ఉంది. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారికి ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు ఎంతో కాలంగా కష్టపడుతున్న పనుల్లో ఇప్పుడు విజయం వరిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది.

