Rahu-Mercury Transit: 18 ఏళ్ల తర్వాత ఈ మూడు రాశుల జీవితం స్వర్ణమయం కానుంది..!
Rahu-Mercury Transit:18 సంవత్సరాల తర్వాత బుధ, రాహువుల సంయోగం ఏర్పడుతోంది. ఇది కొన్ని రాశుల వారికి చాలా మేలు చేయనుంది. కొత్త ఉద్యోగాలు, అపారమైన ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది.

Rahu-Mercury Transit
జోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధుడు సుమారు ప్రతి నెలా తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. బుధుడు తెలివితేటలు, తర్కం, కమ్యూనికేషన్, స్నేహానికి కారకుడిగా భావిస్తారు. మరోవైపు రాహువును కఠినమైన మాటలు, జూదం, ప్రయాణాలు, దొంగతనం, దుష్కార్యాలకు కారణంగా భావిస్తారు. రాహువు సుమారు ప్రతిర 18 నెలలకు ఒకసారి ఒక రాశి నుండి మరో రాశిలోకి సంచరిస్తాడు. బుధుడు ఫిబ్రవరిలో కుంభ రాశిలో అడుగుపెట్టనున్నాడు. రాహువు ఇప్పటికే అదే రాశిలో ఉన్నాడు. దాదాపు 18 ఏళ్ల తర్వాత జరుగుతున్న కలయిక. దీని కారణంగా మూడు రాశుల వారికి ఫిబ్రవరిలో చాలా అద్భుతంగా కలిసిరానుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం...
వృషభ రాశి...
రాహు-బుధ గ్రహాల సంయోగం వృషభ రాశివారికి సానుకూల ఫలితాలను తెస్తుంది. ఈ సంయోగం మీ రాశి కర్మ స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి, ఈ సమయంలో మీరు మీ కెరీర్, వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశం ఉంది. మీ పని బ్యాంకింగ్, మార్కెటింగ్, విద్య, మీడియా లేదా పెట్టుబడులకు సంబంధించినది అయితే.. మీరు ఇందులో మంచి లాభాలను పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు చూస్తారు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునేవారికి ఇది సరైన సమయం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది.
మేష రాశి...
రాహు- బుధ సంయోగం మేష రాశివారికి కూడా శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ రాశివారి ఆదాయం రెట్టింపు అవుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి లభిస్తుంది. బుధుడు వ్యాపార గ్రహం కాబట్టి, మీరు బంగారం, వెండి, స్టాక్ మార్కెట్, ఊహాజనిత వ్యాపారం, లాటరీలో పెట్టుబడుల నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు. అంతేకాదు.. ఈ రాశివారికి రాహువు ఆర్థిక లాభాలను తీసుకువస్తాడు. పిల్లలకు సంబంధించిన శుభవార్తలను కూడా వింటారు.
కుంభ రాశి..
రాహువు- బుధ సంయోగం కుంభ రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ గ్రహ సంయోగం మీ రాశి లగ్న స్థానంలో జరుగుతుంది. ఈ సమయంలో ఇది మీ ధైర్యాన్ని పెంచుతుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో మీ సామాజిక హోదా కూడా బలపడవచ్చు. మీ భాగస్వామి తీసుకునే నిర్ణయాల వల్ల కూడా మీరు ప్రయోజనం పొందుతారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. ఈ సమయంలో ప్రజలు మీ మాటలకు బాగా ఆకట్టుకుంటారు. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. పెళ్లికాని వారికి ఈ సమయంలో వివాహం జరిగే అవకాశం ఉంది.ఊహించని ధనలాభం కారణంగా ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

