Shadashtaka Yogam: షడాష్టక యోగంతో కొన్ని రోజుల్లో ఈ 4 రాశులకు రెట్టింపు సంపద
Shadashtaka Yogam: మరికొన్ని రోజుల్లో అంటే డిసెంబర్ 31, 2025న షడాష్టక యోగం ఏర్పడబోతోంది. బుధుడు, అరుణ గ్రహాల శక్తివంతమైన కలయిక వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో అంటే 2026లో ఈ యోగం వల్ల 4 రాశుల వారికి బాగా కలిసొస్తుంది.

మేష రాశి
బుధుడు, అరుణ గ్రహాల కలయిక వల్ల ఏర్పడే షడాష్టక యోగం మేషరాశి వారికి ఎంతో కలిసివస్తుంది. ఈ రాశి వీరిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం విపరీతంగా పెరుగుతాయి. కొత్త పనులు మొదలుపెట్టడానికి వీరికి ఇది మంచి సమయం. ఈ రాశి వారు వ్యాపార రంగంలో ఉంటే పెద్ద లాభాలు వచ్చే అవకాశం ఉంది. వీరి సంపద విపరీతంగా పెరుగుతుంది. వీరు కెరీర్ పరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి బుధ అరుణ గ్రహాల వల్ల ఏర్పడే ఈ యోగం మంచి కాలాన్ని అందిస్తుంది. వీరు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటారు. వీరి జీవితంలో ఉన్న పాత వివాదాలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. వీరు ఉద్యోగంలో, వ్యాపారంలో ఎక్కడైనా కూడ పనిలో ప్రశంసలు పొందుతారు. వీరికి ఆర్థికంగా చాలా లాభాలు కలుగుతాయి. సమాజంలో వీరికి మంచి గౌరవం పెరుగుతుంది. ఈ రాశి వారు ఉద్యోగంలో, వ్యాపారంలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
ధనూ రాశి
ధనుస్సు రాశి వారికి షడాష్టక యోగం ఎంతో కలిసివచ్చేలా చేస్తుంది. వీరికి కొత్త అవకాశాలు వచ్చేలా చేస్తుంది. వీరి విజయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఈ రాశి వారికి ఆలోచనల్లో స్పష్టత, ధైర్యం వస్తాయి. డబ్బుల పరంగా కూడా వీరికి మంచి లాభాలు లభిస్తాయి. వీరు ఉద్యోగంలో కెరీర్‌లో కొత్త శిఖరాలను అందుకుంటారు. వీరు ఏ పని చేసినా కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త పనులు, ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి ఇది ఉత్తమ సమయం.
మిథున రాశి
మిథున రాశి వారికి కలిసొచ్చే కాలం రాబోతోంది. ఈ షడాష్టక యోగం వీరికి కొత్త ఏడాదిలో శుభ ఫలితాలను అందిస్తుంది. కుటుంబంలో ఉన్న టెన్షన్లన్ని తొలగి ప్రశాంతమైన జీవితం గడుపుతారు. వీరికి స్నేహితులతో మంచి బంధం ఏర్పడుతుంది. వీరికి ఈ యోగం వల్ల ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. మీ పట్ల ఇతరులకు గౌరవం పెరుగుతుంది.

