దారిలో శవయాత్ర ఎదురైతే శుభమా ? అశుభమా ? దేనికి సంకేతమో తెలుసా?
మన నిత్య జీవితంలో ఎన్నో విషయాలు చూస్తాం. అయితే కొన్ని విషయాలను చూస్తే.. శుభ సంకేతంగా భావిస్తాం. మరికొన్ని అశుభంగా భావిస్తాం. అయితే.. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు శవయాత్ర చూడటం శుభమా? అశుభమా? శాస్త్రాలు ఏం చెప్తున్నాయో ఓ సారి చూద్దాం.

శవ యాత్ర శుభమా? అశుభమా?
హిందూ సంప్రదాయం ప్రకారం మనం ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు శుభ సమయం చూసుకుని వెళ్తాం. పూర్వకాలంలో కూడా వీటిని పాటిస్తూ వస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు మనకు ఎదురయ్యే కొన్ని సంకేతాలు శుభం, అశుభం అని భావిస్తాం.
మనం పని చేసేటప్పుడు కొన్ని సంఘటనలు శుభకరమని భావించబడతాయి. కొన్ని సంఘటనలు అశుభమని భావించబడతాయి. శకున శాస్త్రం ప్రకారం.. కొన్ని సంఘటనలు మనం చేసే పనిలో విజయం సాధిస్తే.. శుభం అని భావిస్తాం. అలాగే.. రోడ్డు మీద శవయాత్ర చూడటం శుభమా? అశుభమా? అనే ప్రశ్న తలెత్తుతుంది.
జ్యోతిష్యం ప్రకారం రోడ్డు మీద శవయాత్ర కనిపిస్తే శుభసూచకం. అలాగే రోడ్డు మీద శవయాత్ర చూడటం అంటే కోరికలన్నీ నెరవేరుతాయని అర్థం.
శవయాత్ర చూసినప్పుడు చెడు ఆలోచనలు రావడానికి బదులు, నమస్కరించి ముందుకు సాగండి. అలా చేయడం వల్ల ఆగిపోయిన పనులన్నీ త్వరగా పూర్తవుతాయని నమ్మకం.