- Home
- Astrology
- Zodiac signs: ఒక్క నెల ఆగితే ఈ 3 రాశుల వారి జీవితం మారడం ఖాయం.. నక్షత్రం మారనున్న శని గ్రహం
Zodiac signs: ఒక్క నెల ఆగితే ఈ 3 రాశుల వారి జీవితం మారడం ఖాయం.. నక్షత్రం మారనున్న శని గ్రహం
Zodiac signs: జ్యోతిష్యంలో శని గ్రహానికి ఉన్న ప్రాధాన్యత గురించి తెలిసిందే. ప్రతీ ఒక్కరిపై శని ప్రభావం పడుతుంది. అక్టోబర్‌లో శని గ్రహంలో జరుగుతోన్న మార్పుతో 3 రాశుల వారికి మంచి జరగనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

దీపావళి ముందు కీలక మార్పు
2025 అక్టోబర్ 3న రాత్రి 9:49 గంటలకు శని గ్రహం పూర్వాభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ మార్పు దీపావళికి ముందే జరగడం విశేషం. గురు నక్షత్రమైన పూర్వాభాద్రపదలో శని సంచారం అనేక రాశులపై ప్రత్యేక ప్రభావం చూపనుంది. ముఖ్యంగా కర్కాటక, కుంభ, మీన రాశి వారికి ఇది శుభప్రదంగా మారుతుంది.
జ్యోతిషశాస్త్రంలో శని ప్రాధాన్యం
జ్యోతిషశాస్త్రం ప్రకారం శని గ్రహం శక్తివంతమైనదిగా, కఠినమైనదిగా పరిగణిస్తారు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు శని తన రాశిని మారుస్తాడు. అలాగే ప్రతి సంవత్సరం తన నక్షత్రాన్ని మార్చి కొత్త ఫలితాలను ఇస్తాడు. ప్రస్తుతం శని మీన రాశిలో వక్ర గమనంలో ఉన్నాడు. అక్టోబర్ 3న నక్షత్ర మార్పు జరగనుంది.
కర్కాటక రాశి వారికి లాభాలు
శని దేవుడు పూర్వాభాద్రపదలోకి ప్రవేశించడం కర్కాటక రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సమయంలో శని తొమ్మిదవ ఇంట్లో సంచరించడంతో అదృష్టం బలపడుతుంది. ప్రతి ప్రయత్నంలో విజయం సాధించగలుగుతారు. వృత్తి, విద్య, పెట్టుబడులు ఇలా ప్రతి రంగంలోనూ శుభఫలితాలు పొందే అవకాశం ఉంది.
కుంభ రాశి వారికి కొత్త అవకాశాలు
శని నక్షత్ర మార్పు కుంభ రాశి వారికి కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో కొత్త అవకాశాలు దక్కుతాయి. ఆర్థికంగా స్థిరపడే సమయం ఇది. మీ కృషికి గుర్తింపు లభించే అవకాశం ఉంది.
మీన రాశి వారికి శ్రేయస్సు
పూర్వాభాద్ర నక్షత్రంలో శని సంచారం మీన రాశి వారికి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తుంది. లగ్నంలో శని ఉండడం వల్ల వృత్తి, వ్యాపారం రెండింటిలోనూ ఎదుగుదల ఉంటుంది. మీ ప్రతిష్ట పెరుగుతుంది, సమాజంలో గౌరవం లభిస్తుంది. మీ కృషి ఫలించి పేరు, ప్రఖ్యాతి వస్తాయి.