Shani Transit: ఉగాది తర్వాత ఈ రాశుల అదృష్టాన్ని తలదన్నేవారే లేరు..!
ఉగాది సమయంలోనే శని కుంభ రాశి ని వదిలేసి, మీన రాశిలోకి అడుగుపెడుతోంది. దీని కారణంగా కొన్ని రాశులకు అదృష్టాన్ని తేనుంది? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

శని గ్రహం ఏ రాశిలోకి అడుగుపెట్టినా రెండున్నర సంవత్సరాలు అదే రాశిలో ఉంటుంది. ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్న శని గ్రహం.. కొద్ది రోజుల్లో మళ్లీ రాశిని మార్చుకోనుంది. ఉగాది పండగకు కరెక్ట్ గా ఒక రోజు ముందు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి మారనుంది. అంటే,మార్చి 29వ తేదీన శని కుంభ రాశి నుంచి మీన రాశిలోకి అడుగుపెడుతోంది. దీని కారణంగా, కొన్ని రాశులవారికి ఊహించని అదృష్టం లభించనుంది.మరి కొన్ని రాశులకు కష్టాలు కూడా రానున్నాయి. మరి, ఆ రాశులేంటో తెలుసుకుందామా...
శని గ్రహం రాశిని మార్చుకొని మీన రాశిలోకి అడుగుపెట్టడం వల్ల, మేష రాశి వారికి శని దృష్టి దోషం తొలగుతుంది. గ్రహ శాంతి పూజలు చేయండి. మంచి జరుగుతుంది, జన్మ శని ప్రారంభమవుతుంది.
వృషభ రాశి వారు ఏకాదశ శని ప్రత్యేక ఫలితం పొందుతారు. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది, కానీ జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలో అయినా ఆచి తూచి అడుగులు వేయాలి. లేకపోతే సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మిథున రాశికి దశమ శని వలన వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. లాభాలు చూడటం మొదలుపెడతారు. అంతేకాదు.. జీవితంలో సహాయం చేసే చాలా మంది వ్యక్తులు పరిచయం అవుతారు. వారి సాంగత్యం చాలా మేలు చేస్తుంది. కానీ, రాహువు మార్పు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని నిత్యం పూజిస్తూ ఉండాలి.
కర్కాటక రాశి విషయానికి వస్తే, ఈ రాశి స్త్రీలకు చాలా శుభం జరుగుతుంది. అష్టమ ని దోష పరిహారం చేయించుకోవాలి. అప్పుడు ఇంకా మంచి జరుగుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. రోజూ శ్రీ దుర్గా మాతను పూజించాలి.
సింహ రాశికి శని రాహు సప్తమాష్టమ సంవత్సరం నడుస్తుంది, కష్టంగా ఉంటుంది. శుభ కార్యాలు ఆలస్యం అవుతాయి. శ్రీ నరసింహ దేవర సేవ చేయండి.
కన్య రాశికి సప్తమాష్టమ దోషం ఉంది, శుభ కార్యాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది, ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండండి. శ్రీనివాసుని సేవ చేయండి.
తుల రాశికి పంచమ శని పరిహారం అవుతుంది. పనిలో ఉత్సాహం చూపిస్తారు. పంచమ రాహు దోషం ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య సేవ చేయండి.
వృశ్చిక రాశికి పంచమ శని ప్రారంభం అవుతుంది. చతుర్థ రాహువు వలన అనుకూలం గా ఉంటుంది. మిత్రులు శత్రువుల మీద దృష్టి పెట్టండి. శ్రీ గురువుని పూజ చేయండి.
ధనుస్సు రాశికి చతుర్థ శని, తృతీయ రాహు యోగం అనుకుూలంగా ఉంటుంది. పనితో పాటు సంబంధాలు మారే అవకాశం ఉంది. ప్రయాణాలు కష్టంగా ఉంటాయి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రీ నాగ, మహాదేవుని సేవ చేయండి.
మకర రాశికి జన్మ శని పరిహారం అవుతుంది. ద్వితీయ రాహు దోష సంవత్సరం అవుతుంది. ఇప్పటి నుంచి వీరికి చాలా అవకాశాలు వస్తాయి ఉపయోగించుకోండి. శ్రీ దుర్గా సేవ చేయండి.
కుంభ రాశికి జన్మ శని తొలగి పోయినట్లే. జన్మ రాహు దోషం చాలా మార్పులకు కారణం అవుతుంది, ఆరోగ్యం, మాట, ఖర్చుల మీద దృష్టి పెట్టండి. శ్రీ సుబ్రహ్మణ్య సేవ చేయండి.
మీన రాశికి జన్మ శని వ్యయ రాహువు సంవత్సరం. చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధువులే శత్రువులవుతారు. వ్యాపారంలో ఓపికగా ఉండండి, గ్రహ నాగ శాంతులు జరగాలి.