Saturn Moon Conjunction: శని, చంద్ర యోగం.. 3 రాశులకు లాభాలే లాభాలు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా రాశులు, నక్షత్రాలు మారుస్తుంటాయి. రాజయోగాలు ఏర్పరుస్తుంటాయి. వీటి ప్రభావం 12 రాశి చక్రాలపై పడుతుంది. కొన్ని రాశులకు మంచి జరిగితే.. మరికొన్ని రాశులకు అంతగా కలిసిరాకపోవచ్చు. ఏప్రిల్ 25న శని, చంద్రుడి కలయిక వల్ల యోగం ఏర్పడనుంది. దీనివల్ల 3 రాశుల వారికి అదృష్టం కలిసివస్తుందట. ఆ రాశులెంటో ఇక్కడ తెలుసుకుందాం.

జ్యోతిష్యం ప్రకారం చంద్రుడు తన రాశిని చాలా వేగంగా మారుస్తాడు. శని తన రాశిని నెమ్మదిగా మారుస్తాడు. ఒక రాశిలో రెండు గ్రహాలు ఉన్నప్పుడు యోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం శని మీనరాశిలో ఉన్నాడు. చంద్రుడు కూడా మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు.
శని, చంద్ర యోగం
ఏప్రిల్ 25వ తేదీ గురువారం చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. రెండున్నర రోజుల పాటు చంద్రుడు మీనరాశిలో ఉండి శనితో కలిసి యోగం ఏర్పరుస్తాడు. దీనివల్ల 3 రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులెంటో ఓసారి చూద్దామా..
వృషభ రాశి
వృషభ రాశి వారికి చంద్ర-శని యోగం శుభప్రదం. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు సమయం బాగుంటుంది. బంధువులతో సంబంధాలు బాగుంటాయి. కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో విజయం సాధించవచ్చు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఇంట్లో, కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఉద్యోగులకు సమయం బాగుంటుంది. మీ పదోన్నతి గురించి చర్చ జరగవచ్చు. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. యాత్రకు వెళ్లవచ్చు.
మీన రాశి
మీన రాశి వారికి చంద్ర-శని యోగం శుభప్రదం. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. చంద్రుని అనుగ్రహం వల్ల కళాత్మకమైన పనులపై ఆసక్తి పెరుగుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి. పనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది.