Saturn Mercury Conjunction: 30 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం.. అదృష్టం మొత్తం ఈ రాశులదే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక వల్ల రాజయోగాలు ఏర్పడుతుంటాయి. త్వరలో బుధ, శని గ్రహాలు కలిసి నవపంచమ రాజయోగం ఏర్పరచనున్నాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఏర్పడనున్న ఈ అరుదైన రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానుంది. ఆ రాశులేంటో చూడండి.

నవపంచమ రాజయోగం 2026
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలు వాటి రాశులు, పరస్పర కలయికల ద్వారా ప్రత్యేక యోగాలను ఏర్పరుస్తాయి. ఈ యోగాల ప్రభావాలు కొన్ని రాశులవారి వ్యక్తిగత జీవితాల్లో మంచి, చెడు ప్రభావాలు చూపుతాయి. మార్చిలో రెండు గ్రహాల అరుదైన కలయిక జరగనుంది. గ్రహాల రాకుమారుడు బుధుడు, కర్మఫలదాత శని దేవుడు కలిసి నవపంచమ రాజయోగాన్ని ఏర్పరచనున్నాయి. మార్చి 7న శని మీనరాశిలో ఉదయిస్తాడు. ఈ సమయంలో, శని బుధుడితో కలిసి నవపంచమ రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. దానివల్ల 3 రాశులవారికి మేలు జరుగుతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
మిథున రాశి
మిథున రాశి వారికి నవపంచమ రాజయోగం కెరీర్, వ్యాపార అవకాశాలను పెంచుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కలుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తి కావొచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఉన్నత పదవులు దక్కుతాయి. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అంతేకాదు ఈ సమయంలో ఈ రాశివారి చిరకాల కోరిక నెరవేరవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో అదృష్టం వీరి వెంటే ఉంటుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఊపందుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కెరీర్, వ్యాపారం రెండింటిలోనూ పురోగతికి సూచనలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కొత్త పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. కొంచెం కష్టపడినా చాలు విజయం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి నవపంచమ రాజయోగం సానుకూల మార్పులను తెస్తుంది. పనులు వేగవంతమవుతాయి. మీ ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. కెరీర్, సామాజిక జీవితంలో పురోగతి ఉంటుంది. చేపట్టిన పనుల్లో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడుతాయి. ఈ సమయంలో ఈ రాశివారి నాయకత్వ నైపుణ్యాలు పెరుగుతాయి. దానివల్ల సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుంది. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి లేదా ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

