- Home
- Astrology
- Saturn in Pisces: మీనంలోకి శని.. ఈ 4 రాశుల వారి కష్టాలు తీరినట్టే, వారి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Saturn in Pisces: మీనంలోకి శని.. ఈ 4 రాశుల వారి కష్టాలు తీరినట్టే, వారి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Saturn in Pisces: మీన రాశిలోకి శని వక్ర సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల మహా భాగ్య యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం 4 రాశుల వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. వారి కష్టాలను తొలగిస్తుంది.

వృషభ రాశి
వృషభ రాశి వారికి శని వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. వారి లాభ స్థానంలో శని వక్ర దృష్టి బలంగా ఉండడం వల్ల ఈ సమయం వారికి స్వర్ణయుగమనే చెప్పుకోవాలి. ఊహించని మార్గాల నుంచి డబ్బు వచ్చి పడుతుంది. చాలాకాలంగా ఆగిపోయిన వ్యాపారాలు మళ్లీ లాభాలు తెచ్చిపెడతాయి. షేర్ మార్కెట్, దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి ధనలాభం కలిగే అవకాశం ఉంది.
సింహ రాశి
సింహ రాశి వారికి అష్టమ శని పోతుంది. శని వల్ల ఏర్పడే మహా భాగ్య యోగం వల్ల పరోక్ష ధనలాభం, ఆకస్మిక అదృష్టం కలిగే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాల్లో సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. మనశ్శాంతి దక్కుతుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారి ఐదో ఇంట్లో శని వక్ర సంచారం జరుగుతుంది. దీనివల్ల తెలివితేటలు, ప్రణాళికా సామర్థ్యం పెరుగుతాయి. ఈ రాశి విద్యార్థులు చదువులో, పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయం సాధిస్తారు. పిల్లల వల్ల కుటుంబానికి సంతోషం కలుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇష్టమైన రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయి.
మకర రాశి
మకర రాశి వారికి శని సంచారం వల్ల మేలు జరుగుతుంది. ఈ రాశివారు గతంలో పడిన కష్టానికి, చేసిన కృషికి తగిన ఉన్నత స్థానం దక్కుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెంపు జరిగే అవకాశం ఉంది. కొత్తగా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్న గొడవలు తొలగిపోతాయి.

