- Home
- Astrology
- Panchaka kalam: రోగపంచక కాలం మొదలు.. ఈ 3 రాశుల వారు అయిదు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి
Panchaka kalam: రోగపంచక కాలం మొదలు.. ఈ 3 రాశుల వారు అయిదు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి
Panchaka kalam: జ్యోతిష శాస్త్ర ప్రకారం మే 10వ తేదీ నుండి రోగ పంచక కాలం మొదలైంది. ఈ సమయంలో 3 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఈ సమయంలో విలువైన వస్తువులు పొగొట్టుకునే అవకాశం ఉంది. ఆ మూడు రాశులు ఏవో తెలుసుకోండి.

రోగ పంచక కాలం
హిందూ మతంలో పంచక కాలాన్ని అశుభ సమయంగా చెప్పుకుంటారు. ఈ సమయంలో ఏ శుభాకార్యాలు కూడా చేయరు. పంచక సమయంలో చేసే పనులు ఏవి శుభ ఫలితాలు రావని అంటారు. ఈనెల పంచక కాలం మే 10 ఆదివారం మొదలవుతుంది. అందుకే దీనని రోగ పంచకం అంటారు. ఈ రోజు నుంచి ఐదు రోజులు పాటు మూడు రాశుల మహా జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి
వృషభ రాశి వారు రోగ పంచకం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులను జాగ్రత్తగా దాచుకోవాలి. ఇంట్లో విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. ప్రయాణంలో కూడా వస్తువులు దొంగతనం బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనారోగ్యాల వల్ల మందుల కోసం అధికంగా ఖర్చు పెట్టాల్సి రావచ్చు.
కన్యా రాశి
మే పది నుంచి ఐదు రోజులు పాటు ఉంటే రోగ పంచకం కాలం కన్యా రాశి వారిపై అశుభ ప్రభావాలను చూపిస్తుంది. విలువైన వస్తువులు పోతాయి. దగ్గరి వారే వాటిని దొంగిలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రయాణ సమయంలో మొబైల్ ఫోన్, లాప్టాప్, ఆభరణాలు వంటివి జాగ్రత్తగా చూసుకోవాలి.
మకర రాశి
రోగ పంచక కాలం సమయంలో మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డబ్బు, విలువైన వస్తువులు దొంగతనానికి గురికావచ్చు. మద్యం సేవించినప్పుడు విలువైన వస్తువులు పోవచ్చు. ప్రయాణాల్లో కూడా అతిగా నష్టం జరిగే అవకాశం ఉంది.
