Rare Yoga: 30 ఏళ్ల తర్వాత శని, బుధ అరుదైన కలయిక.. సంపన్నులయ్యే రాశులు ఇవే
Rare Yoga: దాదాపు 30 సంవత్సరాల తర్వాత శని, బుధ గ్రహాలు ఒక ప్రత్యేక సంయోగాన్ని ఏర్పరచనున్నాయి. ఈ రెండు గ్రహాలు 45 డిగ్రీల కోణంలో ఉండి, అర్థ కేంద్ర యోగాన్ని సృష్టిస్తాయి. దీని కారణంగా 3 రాశుల అదృష్టం పెరుగుతుంది..

Zodiac signs
జోతిష్య శాస్త్రంలో.. శని గ్రహాన్ని అత్యంత శక్తివంతమైన గ్రహాలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది వ్యక్తులకు, వారి కర్మల ప్రకారం ఫలితాలను ఇచ్చే ఏకైక గ్రహం. అందుకే.. శనిని నయ్యాదేవత, కర్మ ప్రదాత అని కూడా పిలుస్తారు. శని గ్రహం చాలా నెమ్మదిగా కదులుతుంది. ఒక రాశిని మరో రాశిలోకి అడుగుపెట్టడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. ఒక పూర్తి రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి దాదాపు 30 ఏళ్లు పడుతుంది. ప్రస్తుతం శని మీన రాశిలో ఉంది. కాగా జనవరి 28వ తేదీన బుధ గ్రహంతో 45 డిగ్రీల కోణంలో కలిసి అరుదైన అర్థ కేంద్ర యోగాన్ని ఏర్పరచనుంది. దీని కారణంగా మూడు రాశులకు చాలా మేలు జరగనుంది. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దాం...
మీన రాశి...
బుధ, శని గ్రహాల అరుదైన అర్థ కేంద్ర యోగం.. మీన రాశివారికి చాలా ప్రయోజనాలు అందించనుంది. బుధుడు ఈ రాశి తొమ్మిదో ఇంట్లో, శని లగ్నంలో ఉన్నాడు. దీని ఫలితంగా.. ఈ రాశిలో జన్మించిన వారు అనేక రంగాల్లో విజయం సాధించగలరు.వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు తమ కుటుంబం, వృత్తి, ఆర్థిక పరిస్థితి చాలా సానుకూలంగా మారడాన్ని గమనిస్తారు. ఈ కాలంలో ఈ రాశివారికి విదేశీ ప్రయాణం చేసే అవకాశాలు కూడా రావచ్చు. కెరీర్ లో కూడా విజయం సాధించగలరు. కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి.ఉద్యోగం పరంగా జీతం పెరగడం, ప్రమోషన్ రావడం లాంటివి జరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. మంచి అవకాశాలు పొందుతారు. ఎక్కువ మొత్తంలో డబ్బు పొదుపు చేయగలరు. వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది.
సింహ రాశి..
శని-బుధ గ్రహాలు ఏర్పరుస్తున్న ఈ అరుదై అర్థ కేంద్ర యోగం సింహ రాశివారి జీవితంలోకి చాలా ప్రయోజనాలను మోసుకురానుంది. అదృష్టం పెరుగుతుంది. తెలివితేటలతో శత్రువులను ఓడించగలుగుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ప్రయోజనాలు పొందుతారు. ఈ సమయంలో అప్పుల బాధ కూడా తీరనుంది. అయితే..మాట విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఎవరితోనూ గొడవలు పడకుండా ఉంటే చాలు. విదేశాల నుండి కూడా గణనీయమైన లాభాలు పొందుతారు.
వృషభ రాశి..
అర్థ కేంద్ర యోగం.. వృషభ రాశి వారి జీవితానికి కూడా చాలా మేలు చేయనుంది. ఈ సమయం అంతా ఈ రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అన్నీ శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. మీ సంపద వేగంగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గడంతో.. కుటుంబంలో ఆనందం కూడా పెరుగుతుంది.

