- Home
- Astrology
- Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తారింట్లో అడుగుపెట్టగానే.. భర్త లైఫ్ మారిపోతుంది..!
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తారింట్లో అడుగుపెట్టగానే.. భర్త లైఫ్ మారిపోతుంది..!
Birth Date: న్యూమరాలజీ ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ వారి జీవితాన్ని మాత్రమే కాకుండా, వారితో ముడిపడి ఉన్న వ్యక్తుల జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత కొందరు అమ్మాయిలు తమ భర్త జీవితాన్ని మార్చేస్తారు.

నెంబర్ 3
న్యూమరాలజీ ప్రకారం.. ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన మహిళలకు గురు గ్రహం అధిపతి. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అపారమైన తెలివితేటలు కలిగి ఉంటారు. ఈ అమ్మాయిలు పెళ్లి తర్వాత భర్తకు మంచి అదృష్టాన్ని తెస్తారు. వీరు అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత భర్త జీవితంలో క్రమశిక్షణ, ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. తమ భర్త క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీరు ఇచ్చే సలహాలు అతన్ని విజయ పథంలో నడిపిస్తాయి. వీరు ఇంటిని చక్కదిద్దడంలోనే కాకుండా, భర్త ఎదుగుదలకు వెన్నెముకలా నిలుస్తారు.
నెంబర్ 6..
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 6 కిందకు వస్తారు. ఈతేదీల్లో పుట్టిన వారికి శుక్రుడు అధిపతి. ఈ తేదీల్లో పుట్టిన మహిళలు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపులని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. వీరు అడుగుపెట్టిన ఇంట్లో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. భర్త వ్యాపారంలో నష్టాల్లో ఉన్నా, వీరు వచ్చాక లాభాల బాట పడటం ఖాయం. వీరివల్ల భర్త జీవితంలో విలాసవంతమైన వస్తువులు, వాహనాలు , ఆస్తులు వచ్చి చేరుతాయి.
నెంబర్ 1..
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 1, 10,19, 28 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి సూర్యుడు అధిపతి. వీరు చాలా దృఢమైన మనస్తత్వం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఈ తేదీల్లో ఉన్న అమ్మాయిలను పెళ్లాడితే.. వీరు ప్రతి విషయంలోనూ భర్తకు అండగా నిలుస్తారు. భర్త నిరుత్సాహంలో ఉన్నప్పుడు అతనికి కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తారు. వీరి అదృష్టం వల్ల భర్తకు సమాజంలో పేరు ప్రతిష్టలు, అధికార పదవులు లభిస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ లేదా రాజకీయ రంగాల్లో ఉన్న పురుషులకు ఈ తేదీల్లో పుట్టిన భార్యలు లక్కీ చార్మ్ లా పనిచేస్తారు.
నెంబర్ 9..
ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. వీరికి కుజుడు అధిపతి. ఈ రాశి అమ్మాయిలు చాలా ధైర్యంగా ఉంటారు. భర్తకు వచ్చే ఎలాంటి ఆపదనైనా వీరు ముందుండి ఎదుర్కుంటారు. వీరి అదృష్టం వల్ల భర్త రియల ఎస్టేట్ లేదా నిర్మాణ రంగాల్లో భారీగా సంపాదిస్తారు.

