Raksha Bandhan: ఏ రాశివారికి ఏ రంగు రాఖీ కట్టాలి? ఎలాంటి బహుమతి ఇవ్వాలో తెలుసా?
రాఖీ కట్టిన తర్వాత.. దాదాపు అందరూ.. తమ సిస్టర్స్ కీ, బ్రదర్స్ తమకు తోచిన ఏదో ఒక బహుమతి ఇస్తూ ఉంటారు.

Rakhi Gift
రాఖీ పండగకు భారతీయ సంస్కృతిలో చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ పూర్ణిమ రోజున రాఖీ పూర్ణిమను జరుపుకుంటూ ఉంటాం. ప్రతి అమ్మాయి ఈ రోజున తన తోడు పుట్టిన సోదరుడికి రాఖీ కడుతుంది. తనకు జీవితాంతం రక్షణగా ఉండాలని కోరుతూ ఈ రాఖీ కడతారు.ఈ ఏడాది రాఖీ ఆగస్టు 9వ తేదీన వచ్చింది. అయితే.. రాఖీ కట్టిన తర్వాత.. దాదాపు అందరూ.. తమ సిస్టర్స్ కీ, బ్రదర్స్ తమకు తోచిన ఏదో ఒక బహుమతి ఇస్తూ ఉంటారు. అయితే... మీ బ్రదర్ లేదా సిస్టర్.. వారి రాశి ప్రకారం.. వారికి ఎలాంటి బహుమతి ఇస్తే.. వారి లైఫ్ ఇంకా బాగుంటుందో తెలుసుకుందాం..
1.మేష రాశి...
మీ సోదరుడు మేష రాశికి చెందిన వారు అయితే.. మీరు వారికి ఎరుపు రంగు దారం ఉన్న రాఖీ కట్టడం ఉత్తమం.లేదు అంటే ఆరెంజ్, పసుపు రంగు దారం ఉన్న రాఖీ కట్టవచ్చు. వారికి మీరు ఏదైనా బహుమతి ఇవ్వాలి అనుకుంటే... మీ చేతితో తయారు చేసిన వస్తువులు లేదంటే.. స్టైలిష్ గడియారం, సన్ గ్లాసెస్ ఇవ్వొచ్చు. మీ సిస్టర్ మేష రాశివారు అయితే.. మీరు వారికి రూబీ రత్నాలతో ఉన్న నక్లెస్ లేదంటే.. రూబీ రత్నాలు ఉన్న బ్రేస్లెట్ ఇవ్వచ్చు.
2.వృషభ రాశి..
మీ సోదరుడు వృషభ రాశి వారికి చెందిన వారు అయితే.. మీరు మీ బ్రదర్ కి వెండి లేదా నీలం రంగు దారం ఉన్న రాఖీ కట్టొచ్చు. వారికి ఏదైనా బహుమతి ఇవ్వాలి అనుకుంటే... మంచి పెర్ఫ్యూమ్ ఇవ్వచ్చు. ఏదైనా ఖరీదైన బహుమతి ఇవ్వచ్చు. మీ సోదరి వృషభ రాశి కి చెందిన వారు అయితే.. మీరు వారికి బ్రాండెడ్ పెర్ఫ్యూమ్‌లు, ఆభరణాలు, చాక్లెట్ల గిఫ్ట్ బాక్స్ ఇవ్వచ్చు.
3.మిథున రాశి...
మీ బ్రదర్ మిథున రాశికి చెందినవారు అయితే.. మీరు వారికి ఆకుపచ్చ రంగు రాఖీ కట్టొచ్చు. వారికి నచ్చిన ఏదైనా పుస్తకాలు, ఫోటో ఫ్రేమ్ లు గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. మీ సోదరి మిథున రాశికి చెందిన వారు అయితే.. మీరు వారిరకి హ్యాండ్ బ్యాగ్, ఏదైనా షోపీస్, గ్రీటింగ్ కార్డు లాంటివి గిఫ్ట్ గా ఇవ్వొచ్చు.
4.కర్కాటక రాశి.
సోదరి కోసం: చేతితో చేసిన బహుమతులు, భావోద్వేగ విలువ కలిగిన వస్తువులు
సోదరుడు కోసం: ముత్యపు రాఖీ, హోమ్ మేడ్ స్వీట్స్ లేదా ఆహారం ఇస్తే.. వారికి మంచి జరుగుతుంది.
5.సింహ రాశి..
సోదరి కోసం: సౌందర్య సాధనాలు, స్టేట్‌మెంట్ జ్యూవెలరీ, అందమైన దుస్తులు
సోదరుడు కోసం: గులాబీ, నారింజ లేదా ఎరుపు రంగు రాఖీ. గ్రూమింగ్ కిట్ లేదా స్టైలిష్ గిఫ్ట్
6.కన్య రాశి..
సోదరి కోసం: ప్రకృతి ప్రేమించే వారు అయితే.. మీరు వారికి నచ్చిన ఏవైనా కళాఖండాలు, జ్యువెలరీ లాంటివి బహుమతిగా ఇవ్వొచ్చు.
సోదరుడు కోసం: తెలుపు/ఆకుపచ్చ రంగు దారం ఉన్న రాఖీ కట్టాలి. బహుమతిగా పుస్తకాలు, గడియారం లాంటివి ఇవ్వొచ్చు.
7.తుల రాశి..
సోదరి కోసం: ఫోటో ఫ్రేమ్, విలువైన వజ్రాల ఆభరణాలు
సోదరుడు కోసం: ఊదా/మణి రంగు రాఖీ కట్టండి. పెర్ఫ్యూమ్‌లు, సువాసనగల కొవ్వొత్తులు బహుమతిగా ఇవ్వడం వారికి చాలా మేలు చేస్తుంది.
8.వృశ్చిక రాశి (Scorpio)
సోదరి కోసం: హై-ఎండ్ పర్స్, బ్రాండెడ్ గ్రూమింగ్ కిట్స్, డార్క్ చాక్లెట్లు
సోదరుడు కోసం: కుంకుమ పువ్వు లేదా ఎరుపు రాఖీ. డిజైనర్ దుస్తులు, స్టైలిష్ ఉపకరణాలు
9.ధనుస్సు (Sagittarius)
సోదరి కోసం: ట్రెండీ జ్యువెలరీ – ఉంగరాలు, నెక్లెస్‌లు, బ్రాస్లెట్‌లు
సోదరుడు కోసం: పసుపు రాఖీ. గేమ్ CDలు లేదా ధైర్యవంతమైన బహుమతులు
10. మకరం (Capricorn)
సోదరి కోసం: బ్లేజర్, చేతి గడియారం – ప్రొఫెషనల్ లుక్ ఇచ్చేవి కూడా బహుమతిగా ఇవ్వొచ్చు.
సోదరుడు కోసం: గులాబీ రంగు దారం ఉన్న రాఖీ కట్టొచ్చు. ఫ్యాషన్ బెల్ట్‌లు లేదా స్టైలిష్ షూలు మీరు బ్రదర్ కి బహుమతిగా ఇవ్వొచ్చు.
11. కుంభ రాశి (Aquarius)
సోదరి కోసం: హ్యాండ్ బ్యాగ్, లేదా ఏదైనా ముదురు రంగు వస్తువులు
సోదరుడు కోసం: నీలం/బూడిద రంగు రాఖీ. టెక్ గ్యాడ్జెట్‌లు – స్మార్ట్‌ఫోన్, కెమెరా, పెన్ డ్రైవ్
12.మీనం (Pisces)
సోదరి కోసం: సముద్రపు ఆకుపచ్చ/పసుపు రంగు వస్తువులు ఇవ్వచ్చు. వారికి నచ్చిన ఫుడ్ ఏదైనా గిఫ్ట్ గా ఇవ్వొచ్చు.
సోదరుడు కోసం: పసుపు/తెలుపు రంగు దారం ఉన్న రాఖీ కట్టడం మంచిది. ఆధ్యాత్మిక వస్తువులు ఏవైనా గిఫ్ట్ గా ఇవ్వొచ్చు.