- Home
- Astrology
- Zodiac Signs: రాఖీ పండుగ నాడు నాలుగు గ్రహాల వక్రగతి.. ఏ రాశి వారికి కలిసివస్తుందో తెలుసా?
Zodiac Signs: రాఖీ పండుగ నాడు నాలుగు గ్రహాల వక్రగతి.. ఏ రాశి వారికి కలిసివస్తుందో తెలుసా?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది రాఖీ పండుగనాడు 4 గ్రహాలు వక్రగతిలో ఉంటాయి. దానివల్ల కొన్ని రాశులవారికి అదృష్టం కలిసివస్తుంది. మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. మరి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

గ్రహాల వక్రగతి ప్రభావం
అన్నా చెల్లెల్ల ప్రేమకు ప్రతీక అయిన రాఖీ పండుగను ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 9న రాఖీ పండుగ వస్తోంది. ఈ ఏడాది వచ్చే రాఖీ పండుగ చాలా విశిష్టమైనది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఆ రోజున నాలుగు గ్రహాలు వక్రగతిలో ఉంటాయి. శని, బుధుడు, రాహువు, కేతువులు రాఖీ పండుగ నాడు వక్రగతిలో ఉంటాయి. గ్రహాల వక్రగతి వల్ల రెండు రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. మరికొన్ని రాశులవారికి చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఆ రాశులేంటో తెలుసుకుందామా...
వృశ్చిక రాశి వారికి ఆర్థిక లాభాలు.
నాలుగు గ్రహాల వక్రగతి వల్ల వృశ్చిక రాశి వారికి మేలు జరుగుతుంది. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడుల నుంచి లాభాలు దక్కుతాయి. ఏ పని చేపట్టినా విజయం సిద్ధిస్తుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి సానుకూల ఫలితాలు రావచ్చు. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.
మీన రాశి వారికి వ్యాపారాల్లో లాభాలు
మీన రాశి వారికి ఈ సమయం అనుకూలం. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. వ్యాపారాల్లో లాభాలు దక్కుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి సమయం అనుకూలం. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ బంధం బలపడుతుంది. బంధువులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు రావచ్చు.
ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి!
మేష, మిథున, కర్కాటక రాశులవారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 4 గ్రహాల వక్రగతి.. ఈ రాశుల వారికి అంత మంచిది కాదు. ప్రతి పనిలోనూ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి. పెద్ద పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు చాలా కష్టపడాల్సి వస్తుంది.