Rahu Gamanam: రుద్రతాండవం చేయనున్న రాహువు, ఈ రాశుల వారికి కష్టాలే
Rahu Gamanam: 2026వ సంవత్సరంలో రాహువు సంచారం వల్ల తీవ్ర ఇబ్బందులు కొన్ని రాశులకు కలిగే అవకాశం ఉంది. కొన్ని రాశుల వారి జీవితాల్లో తీవ్ర ప్రతికూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఆ రాశులేవో తెలుసుకోండి.

రాహు సంచారం 2026
జ్యోతిషశాస్త్రంలో రాహువును నీడ గ్రహంగా చూస్తారు. ఇది చెడు చేసే గ్రహంగా పరిగణిస్తారు. అంతే కాదు రాహు గమనం ఎల్లప్పుడూ వక్ర గమనంలోనే ఉంటుంది. 2026లో రాహువు రెండుసార్లు తన స్థానాన్ని మార్చుకోనున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ రాశులేవో తెలుసుకోండి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి రాహు సంచారం వచ్చే ఏడాది అంత అనుకూలంగా ఉండదు. దీని వల్ల 2026లో ఊహించని సమస్యలు, పని ప్రాంతంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వీరికి ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు కూడా ఏర్పడతాయి.
సింహ రాశి
2026లో సింహ రాశి వారికి రాహు సంచారం కలిసిరాదు. దీని వల్ల చిన్న చిన్న కష్టాలు వచ్చే అవకాశం ఉంది. వీరికి పురోగతికి ఆటంకాలు ఏర్పడవచ్చు. మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. వీరు సంపాదించినదంతా ఖర్చు పెట్టేస్తారు. కుటుంబంలో, పనిలో వాదనలు జరగవచ్చు.
కన్య రాశి
కన్య రాశి వారికి రాహు సంచారం ఆరోగ్యపరమైన కష్టాలను కలిగిస్తుంది 2026లో ఆరోగ్యంపై ఈ రాశి వారు శ్రద్ధ పెట్టాలి. ఆదాయం తక్కువే వస్తున్నా, ఖర్చులు మాత్రం పెరిగిపోతాయి. ఆర్థికపరమైన సవాళ్లు అధికంగా ఎదురవుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం.
వృశ్చిక రాశి
2026లో వృశ్చిక రాశి వారికి బాగా కలిసివస్తుంది. కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి లాభాలు రాకపోవచ్చు. ఏదైనా ఫలితాలు పాటిజివ్ గా రాకుండా నిరాశ, మానసిక ఒత్తిడికి కారణం అవుతాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి కొత్త ఏడాదిలో రాహువు ప్రభావం ఎక్కువ. దీని వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. శారీరక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోవాలి. లేకుంటే మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోవచ్చు. ఈ ఏడాది ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది.
మీన రాశి
మీన రాశి వారు 2026లో రాహు సంచారం తీవ్రమైన ఆర్థిక నష్టాలకు కారణం అవుతుంది. ఆదాయం తగ్గిపోతాయి ఇబ్బందులు పడతారు. కొందరికి ఉద్యోగం పోవచ్చు కూడా. ఖర్చులు విపరీతంగా పెరిగి ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. వీరిలో మానసిక ఆందోళన, ఒత్తిడి పెరిగిపోయి ఇబ్బందులు పడతారు.

