- Home
- Astrology
- 100 ఏళ్ల తర్వాత కుంభ రాశిలో పవర్ ఫుల్ యోగా..ఈ రాశుల అదృష్టానికి తలుపులు తెరుచుకున్నట్లే
100 ఏళ్ల తర్వాత కుంభ రాశిలో పవర్ ఫుల్ యోగా..ఈ రాశుల అదృష్టానికి తలుపులు తెరుచుకున్నట్లే
కుంభ రాశిలో త్రిగ్రహి యోగం ఏర్పడనుంది. ఫిబ్రవరిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు కుంభ రాశిలో సంచరించనున్నారు. ఈ త్రిగ్రహి యోగం కారణంగా.. కొన్ని రాశుల వారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో ప్రత్యేక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది.

త్రిగ్రహి యోగం...
వేద జోతిష్యశాస్త్రం ప్రకారం, ఫిబ్రవరిలో అనేక గ్రహాలు తమ రాశులను మార్చుకుంటాయి. ఇది శుభకరమైన, రాజయోగ కలయికలను సృష్టిస్తుంది. ఫిబ్రవరిలో బుధుడు, సూర్యుడు, శుక్ర గ్రహం కుంభ రాశిలో ఒకే సమయంలో కలవనున్నాయి. ఈ శక్తివంతమైన కలయిక కొన్ని రాశుల వారికి కెరీర్ లో పురోగతిని తెస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి అకస్మాత్తుగా మెరుగుపడుతుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శ్రేయస్సును పొందుతారు. వ్యాపారంలో ఊహించని లాభాలు పొందుతారు. మరి, ఏయే రాశులకు ఈ అదృష్టం కలగనుందో ఇప్పుడు చూద్దాం..
కుంభ రాశి..
త్రిగ్రహి యోగం కుంభ రాశివారికి అదృష్టాన్ని తెస్తుంది. ఇది మీ రాశి లగ్న స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి, ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు గౌరవం, ప్రతిష్ఠ కూడా పొందుతారు. వివాహితులు అద్భుతమైన వైవాహిక జీవితాన్ని ఆనందిస్తారు. మీ ప్రేమ జీవితం చాలా రొమాంటిక్ గా మారుతుంది. మీ భాగస్వామితో కలిసి మంచి ట్రిప్ కి వెళ్లే అవకాశం ఉంటుంది.
మేష రాశి..
త్రి గ్రహి యోగం మేష రాశివారికి శుభ ఫలితాలను తెస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాల నుంచి డబ్బు సంపాదించగలరు. కెరీర్ లో పురోగతి పొందే అవకాశం ఉంది.మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు.
మిథున రాశి..
త్రి గ్రహి యోగం మిథున రాశివారికి అనేక ప్రయోజనాలు తెస్తుంది. అదృష్టం రెట్టింపు అవుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొత్తగా ఏదైనా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం లేదా వ్యాపారం ప్రారంభించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా రావచ్చు.
ధనుస్సు రాశి..
త్రి గ్రహి యోగం ధనుస్సు రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంటుంది. తీర్థ యాత్రలకు వెళ్లొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త అందవచ్చు. ఇది మీకు చాలా శుభప్రదమైన సమయం. దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మీరు గణనీయమైన ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. గతంలో చేసిన పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి.
వృషభ రాశి..
ఈ గ్రహాల కలయిక వృషభ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు పనిలో గౌరవం లభిస్తుంది. సూర్యుడు మీ నాల్గవ ఇంటిపై దృష్టి సారిస్తాడు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారికి గౌరవం లభిస్తుంది. వ్యాపారవేత్తలు మంచి లాభాలను ఆశించవచ్చు. మీ ఉద్యోగ వేట విజయవంతం కావచ్చు. కొత్త ఇల్లు పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త వాహనం కూడా రావచ్చు. మీ కెరీర్‌కు ఈ సమయం చాలా శుభప్రదం. దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి.
కన్య రాశి..
కన్య రాశి వారికి, కుంభరాశిలో మూడు గ్రహాల కలయిక ఆకస్మిక పురోగతికి అవకాశాలను సృష్టిస్తోంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లభిస్తుంది. ఉన్నతాధికారులు మీ పట్ల దయగా ఉంటారు. విదేశీ వ్యవహారాలలో పాలుపంచుకున్న వారు ప్రయోజనం పొందుతారు.సంబంధాలు బలపడతాయి. మీరు మీ శత్రువులకు బుద్ధి చెప్పగలుగుతారు. మీ కెరీర్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ఇది సరైన సమయం.

