MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 03.03.2026 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 03 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి, వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగాలలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి.

Related Articles

Related image1
Sun Transit: మీన రాశిలో సూర్య సంచారం.. ఈ 4 రాశులవారికి బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్!
Related image2
Holi 2026: హోలీ పండగ నుంచి ఈ 4 రాశులవారి జీవితం మారిపోవడం పక్కా.. అన్నీ శుభవార్తలే!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

సన్నిహితుల నుంచి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ఇంటా బయటా బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆదాయం బాగుంటుంది. సన్నిహితుల సహకారంతో చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగ బాధ్యతలు చక్కగా నిర్వహిస్తారు.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టపోతారు. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగులకు తోటివారితో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. వృత్తి, వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులతో వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారాలు అనుకూలం. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ఆదాయ మార్గాలు తగ్గుతాయి. పాత అప్పులు తీర్చడానికి  కొత్త అప్పులు చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇంటి వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార భాగస్వాములతో సమస్యలు ఉంటాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

అవసరానికి కుటుంబ సభ్యుల నుంచి డబ్బు సహాయం లభిస్తుంది. ఇంట్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలం. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సోదరుల నుంచి డబ్బు సహాయం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

దాయాదులతో వివాదాలు కలుగుతాయి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార, ఉద్యోగాలు మరింత మందగిస్తాయి. సంతానం విద్యా విషయాలలో కొంత నిరాశ తప్పదు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chandra Grahanam: మీ రాశిపై ఎఫెక్ట్ ఎంత? ఈ రంగులు ధరిస్తే సేఫ్..!
Recommended image2
Lunar Eclipse: గ్రహణం రోజు దర్బలు ఎందుకు వేస్తారు...?
Recommended image3
Jupiter Transit: గురు గ్రహ ప్రత్యక్ష సంచారం..ఈ రాశులకు అదృష్ట యోగం..!
Related Stories
Recommended image1
Sun Transit: మీన రాశిలో సూర్య సంచారం.. ఈ 4 రాశులవారికి బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్!
Recommended image2
Holi 2026: హోలీ పండగ నుంచి ఈ 4 రాశులవారి జీవితం మారిపోవడం పక్కా.. అన్నీ శుభవార్తలే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved