Zodiac signs: ఈ రాశి అమ్మాయిలకు నర దిష్టి ఎక్కువ.. వారి అందమే కారణం..!
Zodiac signs:జోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి రాశికీ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, శైలి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాశులకు చెందిన అమ్మాయిలు సహజంగానే అద్భుతమైన ఆకర్షణ కలిగి ఉంటారు. వీరి రూపానికీ, కురులకు, వీరు ధరించే దుస్తులకు ఒక ప్రత్యేకమైన కళ ఉంటుంది.

Zodiac signs
మీరు గమనించారో లేదో.. కొందరు అమ్మాయిలు ఏ డ్రెస్ వేసుకున్నా వారికి అది చక్కగా అమరిపోతుంది. ‘ డ్రెస్ కారణంగా వాళ్లకు అందం రాదు.. వారు వేసుకోవడం వల్లే.. ఆ డ్రెస్సుకే అందం వచ్చిందా?’ అనిపించేలా ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ జాబితాలో కొన్ని రాశులు ఉన్నాయి. ఈ రాశుల అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. అందుకే వారికి నరదిష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..
1.కర్కాటక రాశి...
కర్కాటక రాశి అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. ఈ రాశికి చంద్రుడు అధిపతి. కాబట్టి, ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ప్రశాంతంగా ఉంటారు. వీరిలో వెన్నెల లాంటి ఒక మెరుపు ఉంటుంది. ఇక.. ఈ రాశి అమ్మాయిలకు సాంప్రదాయ దుస్తులు, ముఖ్యంగా చీరలు లేదా లేత రంగుల డ్రెస్సులు వీరికి బాగా నప్పుతాయి. ఈ అమ్మాయిల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. వీరి కళ్లు. వీళ్ల కళ్లు చాలా అందంగా ఉంటాయి. ఇక అమ్మాయిలు తమ చిరునవ్వుతోనే అందరినీ ఇట్టే ఆకర్షిస్తాయి.
2.తుల రాశి..
తల రాశికి శుక్రుడు అధిపతి. ఈ రాశి అమ్మాయిలకు అందంగా కనిపించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఈ అమ్మాయిలు ఫ్యాషన్ ప్రపంచంలో బాగా రాణించగలరు.ఇక.. వీరికి ఎలాంటి దుస్తులు అయినా బాగా నప్పుతాయి. మరీ ముఖ్యంగా మోడ్రన్, డిజైనర్ వేర్ దుస్తుల్లో వీరు బాగా మెరిసిపోతారు. వీరు చాలా సింపుల్ డ్రెస్ వేసుకున్నా, బ్రాండెడ్ లుక్ ఇస్తుంది. వీరి శరీర సౌష్టవం కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. మేకప్ అవసరం లేకుండా కూడా అందంగా మెరిసిపోతారు.
3.ధనుస్సు రాశి...
ధనుస్సు రాశికి చెందిన అమ్మాయిలు కూడా అందంలో ముందుంటారు. ఈ రాశి అమ్మాయిలు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరిలో రాజసం ఉట్టిపడేలా ఉంటుంది. వీరికి ఇండో-వెస్ట్రన్ దుస్తులు, ముదురు రంగులు (ముఖ్యంగా పసుపు, మెరూన్) బాగా సెట్ అవుతాయి.ఈ రాశి అమ్మాయిలకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే... పొడవైన, ఒత్తైన కురులు వీరికి సహజంగానే లభిస్తాయి. నడకలో ఒక గ్రేస్ ఉంటుంది. అందుకే వీరికి నరదిష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది.
4.కుంభ రాశి...
వీరి ఆలోచనలు ఎలాగైతే భిన్నంగా ఉంటాయో, వీరి లుక్ కూడా అలాగే ఉంటుంది. ట్రెండ్ ను ఫాలో అవ్వడం కాదు, ట్రెండ్ ను సెట్ చేస్తారు. వీరికి యూనిక్, వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ చాలా బాగుంటాయి. సిల్వర్ జ్యువెలరీ వీరికి అదనపు అందాన్ని ఇస్తుంది. వీరి ముఖ కవళికలు చాలా షార్ప్ గా ఉంటాయి.
వీరికి నర దిష్టి ఎందుకు ఎక్కువగా తగులుతుంది?
"నరుడి కంటికి నల్ల రాయి కూడా పగులుతుంది" అని సామెత. ఈ నాలుగు రాశుల అమ్మాయిలు గుంపులో ఉన్నా స్పెషల్ గా కనిపిస్తారు. వీరి లావణ్యం, అందమైన జుట్టు , డ్రెస్సింగ్ సెన్స్ చూసి ఇతరులు అసూయపడే అవకాశం ఉంటుంది. దీనివల్ల దిష్టి తగిలి.. వీరు తరచుగా నీరసంగా అనిపించడం, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడం లేదా మానసిక అశాంతికి లోనవ్వడం జరుగుతుంటుంది.

