Planetary Transit: జనవరిలో ఒకే రాశిలోకి రానున్న 4 గ్రహాలు, ఈ రాశులకు డబుల్ హ్యాపీ
Planetary Transit: కొత్త ఏడాది మొదటి నెలలో అంటే జనవరిలో నాలుగు గ్రహాలు తమ రాశిని మార్చుకోనున్నాయి. బుధుడు, సూర్యుడు, కుజుడి, శుక్రుడు తమ రాశులను మార్చుకోవడం వల్ల కొన్ని రాశుల వారికి గోల్డెన్ టైమ్ మొదలవుతుంది.

జనవరిలో ఏ రాశులు లక్కీ?
వేద జ్యోతిష క్యాలెండర్ ప్రకారం జనవరి 2026లో నాలుగు గ్రహాలు తమ రాశిని మార్చుకోనున్నాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి బీభత్సంగా కలిసి వస్తుంది. మొదటగా జనవరి 14న సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. తర్వాత కుజుడు కూడా అదే మకరరాశిలోకి వస్తాడు. ఇక జనవరి 17న బుధుడు కూడా మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక ఆ తరువాత శుక్రుడు కూడా మకరరాశిలోకి ప్రవేశించడంతో మకరరాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ నాలుగు గ్రహాలు ఏర్పరచిన ఈ యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది. ముఖ్యంగా వారి జీవితంలో ఆనందాన్ని నింపుతుంది.
తులా రాశి
తులా రాశి వారికి ఈ నాలుగు గ్రహాల సంచారం సానుకూలంగా ఉంటుంది. ఈ సంచారం ఈ రాశిచక్రం నుంచి నాలుగో ఇంట్లో జరగడం వల్ల వీరికి ఎన్నో సుఖాలు కలుగుతాయి. సంతోషంతో ఇంటి వాతావరణమే మారిపోతుంది. వీరు వాహనం లేదా ఆస్తిని కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెంపు వంటివి కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
మేష రాశి
మేషరాశి వారికి వృత్తి, వ్యాపార విషయాల్లో బాగా కలిసొచ్చే సమయం ఇది. నాలుగు గ్రహాల సంచారం వీరికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సంచారం, ఏర్పడిన యోగం మీ కర్మ స్థానంలో జరగడం వల్ల ఈ రాశి ఈ సమయంలో ఏ పని చేసిన శుభప్రదంగా సాగుతుంది. వ్యాపారంలో పురోగతిని చూస్తారు. ఉద్యోగులకు అభివృద్ధి, బోనస్ లేదా ప్రమోషన్ గురించి శుభవార్తలు అందుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొ త్త ఒప్పందాలు, భాగస్వామ్యాలు, లాభాలు కలుగుతాయి.
మకర రాశి
మకరరాశి వారికి ఈ నాలుగు గ్రహాల సంచారం చాలా లాభాలు తెచ్చిపెడుతుంది. ఈ సంచారం మకర రాశిలోనే ఏర్పడనుంది కాబట్టి వీరికి ఇంకా కలిసొస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారి ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబం, స్నేహితుల సపోర్టుతో మీరు చేసిన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి.

