- Home
- Astrology
- Planetary Clash : మకరరాశిలోకి బుధుడు, కుజుడు.. ఈ మూడు రాశులవారికి గ్రహ యుద్దం ఎఫెక్ట్ గట్టిగానే..!
Planetary Clash : మకరరాశిలోకి బుధుడు, కుజుడు.. ఈ మూడు రాశులవారికి గ్రహ యుద్దం ఎఫెక్ట్ గట్టిగానే..!
జ్యోతిషశాస్త్రం ప్రకారం… రెండు ప్రధాన గ్రహాలైన కుజుడు, బుధుడి మధ్య యుద్ధం జరగనుంది. ఇది కొన్ని రాశుల వారి ఆర్థిక పరిస్థితి, ప్రవర్తన, మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

ఒకే రాశిలోకి బుధుడు, కుజుడు
జనవరి 16, 2026న కుజుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. కొన్ని గంటల తర్వాత జనవరి 17, 2026న బుధుడు కూడా ఇదే మకరరాశిలోకి వెళ్తాడు. ఇది కుజ, బుధ గ్రహాల మధ్య కలయికకే కాకుండా వాటి మధ్య యుద్ధానికి కూడా దారితీస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
గ్రహ యుద్దం అంటే ఏమిటి..?
కుజ, బుధ గ్రహాలు మకరరాశిలో 27 డిగ్రీలలో సంచరించనున్నారు. గ్రహాలు ఒకే రాశిలో ఒకే డిగ్రీలో సంచరించినప్పుడు దానిని గ్రహ యుద్ధం అంటారు. కుజుడు, బుధుడు శత్రు గ్రహాలు కాబట్టి, ఈ ఘర్షణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు శక్తి, కోపం, ధైర్యానికి... బుధుడు తెలివి, మాట, వ్యాపారం, నిర్ణయాలకు ప్రతీక. అందుకే 2026 జనవరి 18 నుండి 21 వరకు కొన్ని రాశుల వారికి ఈ విషయాల్లో చాలా ఆటంకాలు కలగవచ్చు.
మేష రాశి
మేషరాశి వారికి కోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది... అకారణంగా వచ్చే ఈ కోపం ఎవరినైనా బాధపెట్టవచ్చు. ఇది సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీరు కోప్పడ్డారని బాధపడుతూ ఎదుటివారు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు... కొందరికి ఇది ప్రమాదకరం కావచ్చు. వ్యాపారంలో నష్టాలు కూడా రావచ్చు.
మిథున రాశి
మిథున రాశి వారు అపార్థాలను ఎదుర్కోవచ్చు. కాబట్టి మీ సంభాషణల్లో స్పష్టంగా ఉండండి, లేకపోతే విభేదాలు రావచ్చు. ఈ రాశివారు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే మీ నిర్ణయాలను తెలివిగా తీసుకోండి.
కన్యా రాశి
కుజ, బుధ గ్రహాల మధ్య ఘర్షణ కన్యారాశి వారికి ఒత్తిడిని పెంచుతుంది. వారు ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ధ్యానం చేయండి లేదా మంత్రాలను జపించడం చేయండి. మనసును మీ అదుపులో పెట్టుకుని ఏ పనైనా చేసేటపుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.

