Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి ప్రేమలో పొసెసివ్‌నెస్ ఎక్కువ, ఎవరి మాట వినరు
Numerology: కొన్ని తేదీల్లో పుట్టినవారు మొండిగా ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఎవరి మాట వినరు. ముఖ్యంగా వీరు ప్రేమలో పడ్డారంటే చాలా పొసెసివ్ గా ఉంటారు. ఏ తేదీల్లో పుట్టిన వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకోండి.

ఈ తేదీల్లో పుట్టినవారు
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా ఒక ములాంకాన్ని నిర్ణయిస్తారు. ఈ ములాంకాన్ని బట్టి వ్యక్తి ఆలోచన విధానం, స్వభావం, జీవన శైలి, ప్రేమ జీవితం వంటివి ఆధారపడి ఉంటాయి. జ్యోతిష పండితులు చెబుతున్న ప్రకారం ఏ నెలలోనైనా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినవారి మూల సంఖ్య 4. అంటే మీ పుట్టిన తేదీలోని అంకెలను కలిపితే మూల సంఖ్య వస్తుంది. 4 మూలా సంఖ్యతో సంబంధం కలిగి ఉన్న గ్రహం రాహువు. రాహు ప్రభావం వల్ల ములాంక్ 4 వ్యక్తులు ఇతరులకంటే ఎంతో భిన్నంగా ఆలోచిస్తారు. వీరి జీవితంలో ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యక్తుల ప్రేమ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీరు ప్రేమలో చాలా పొసెసివ్ నెస్ తో ఉంటారు. వీరిది అతి ప్రేమ. దాన్ని తట్టుకోవడం చాలా కష్టం.
అతి శ్రద్ధ ఎక్కువ
వీరు ప్రేమను చాలా సీరియస్ గా తీసుకుంటారు. సంబంధాలు కొనసాగించే అలవాటు వీరిలో తక్కువగా కనిపిస్తుంది. ఒకరిని ప్రేమించాక ఆ సంబంధాన్ని బలంగా నిలబెట్టుకోవాలనే తపన వీరిలో ఉంటుంది. తమలో ఉన్న ప్రేమను మాటలకంటే తమ చేతల ద్వారా చూపిస్తారు. వీరికి తమ భాగస్వామిపై అపారమైన శ్రద్ధ చూపుతారు. అయితే ఈ శ్రద్ధ కొన్నిసార్లు చాలా అతిగా వాస్తయి. అందుకే ఎక్కువ పొసెసివ్ నెస్ లా కనిపించవచ్చు. తమ భాగస్వామి ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలను పదే పదే కనుక్కునేందుకు ప్రయత్నిస్తారు. ఇది ఇతరులకు చికాకును కలిగిస్తుంది. వీరికి ఇతరులను నియంత్రించే భావన అధికంగా కనిపిస్తుంది. తమ భాగస్వామి జీవితంలో ప్రతి అంశం తమకు తెలిసి ఉండాలనే కోరిక ఉంటుంది. ఇది కొన్నిసార్లు గొడవలకు దారి తీస్తుంది. అయితే వీరు చెడ్డవారు కాదు. ప్రేమను కోల్పోతామనే భయం కారణంగా వీరు ఇలా ప్రవర్తిస్తారు. భాగస్వామి నమ్మకాన్ని నిలబెట్టుకుంటే వీరు చాలా సహనంతో వ్యవహరిస్తారు.
అబద్ధాలు నచ్చవు
వీరికి అబద్ధాలు అస్సలు నవచ్చు. ఏ విషయంలోనైనా స్పష్టంగా ఉండాలని కోరుకుంటారు. గందరగోళం, సందేహాలు వీరికి నచ్చవు. ఒకసారి నమ్మకం ఏర్పడితే జీవితాంతం ఆ సంబంధాన్ని గౌరవిస్తారు. కష్టసమయం వచ్చినా కూడా భాగస్వామిని వదిలిపెట్టరు. ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. కుటుంబానికే తమ మొదటి ప్రాధాన్యం. రాడిక్స్ సంఖ్య 4 కలిగిన వ్యక్తులు కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. జీవితంలో ఏది సులభంగా లభించదు అనే భావన వీరిలో బలంగా ఉంటుంది. అందుకే ప్రతి దానికోసం చాలా కష్టపడతారు. ప్రేమ విషయంలో కూడా ఇలాగే ఉంటారు. సంబంధం నిలవాలంటే ప్రయత్నం అవసరం అని నమ్ముతారు.వీరి గురించి వారి భాగస్వామి అర్థం చేసుకుంటే వారి సంబంధం మరింత బలపడుతుంది.
మొండిగా ఉంటారు
కొన్నిసార్లు వీరిలో మొండితనం అధికంగా కనిపిస్తుంది. తమ అభిప్రాయం మార్చుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఇతరుల సూచనలు, సలహా వెంటనే అంగీకరించరు. ఈ లక్షణం ప్రేమ జీవితం పై ప్రభావం చూపవచ్చు. వీరి వాదన మొదలుపెడితే ఒకంతట ఆపరు. సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి వీరు తమ భాగస్వామితో ఆలోచనలు పంచుకుంటే అపార్థాలు దూరమవుతాయి. ఓపికతో వ్యవహరిస్తే ఈ వ్యక్తులు విశ్వసనీయ భాగస్వాములుగా మారతారు. మొత్తానికి ములాంక్ 4 వ్యక్తులు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. నమ్మకం, సహనం, స్పష్టత ఉంటే వీరి ప్రేమ జీవితం చాలా స్థిరంగా కొనసాగుతుంది. జీవితాంతం తోడుగా నిలిచే భాగస్వామిగా వీరు మంచి పేరు తెచ్చుకుంటారు.

