Birth date: ఈ తేదీల్లో జన్మించినవారు పుట్టుకతో ధనవంతులు, డబ్బుకు లోటుండదు
Birth date: సంఖ్యాశాస్త్రం చెబుతున్న ప్రకారం నెలలో కొన్ని తేదీల్లో పుట్టినవారు పుట్టుకతోనే ధనవంతులుగా ఉంటారు. వీరికి జీవితంలో డబ్బుకు ఎప్పుడూ లోటుండదు. ఏ తేదీలలో పుట్టినవారు ఇలా కోటీశ్వరులు అవుతారో తెలుసుకోండి.

పుట్టుకతోనే వీరు ధనవంతులు
సంఖ్యాశాస్త్రాన్ని నమ్మేవారి సంఖ్య అధకంగానే ఉంది. ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి అతని స్వభావం, భవిష్యత్తు, ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి చెప్పొచ్చని న్యూమరాలజీ చెబుతోంది. న్యూమరాలజీలో 1 నుంచి 9 వరకు రాడిక్స్ సంఖ్యలు ఉంటాయి. రాడిక్స్ సంఖ్యను బట్టి భవిష్యత్తును అంచనా వేయచ్చు. నెలలో కొన్ని తేదీలలో పుట్టిన వారు పుట్టుకతోనే ధనవంతులవుతారు. వీరికి జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు రాదు.
రాడిక్స్ సంఖ్య 6
ఏ నెలలోనైనా 6, 15 లేదా 24వ తేదీన పుట్టినవారి రాడిక్స్ సంఖ్య 6 అవుతుంది. ఎందుకంటే తేదీలోని అన్ని అంకెలను కలిపితే ఆరే వస్తుంది. ఈ తేదీలలో జన్మించిన వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు. న్యూమరాలజీ ప్రకారం వీరికి డబ్బు లోటు రానే రాదు. వీరు జీవితంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఏం రంగంలో అడుగుపెట్టినా విజయం సాధించి తీరుతారు.
వైవాహిక జీవితం ఎలా ఉంటుంది?
మూల సంఖ్య 6 కలిగినవారు డబ్బు పొదుపు చేయడంలో ముందుంటారు. ఈ స్వభావమే వారికి డబ్బు కొరత రాకుండా చేస్తుంది. వీళ్లు తమ భాగస్వామిని ఎంతో ప్రేమిస్తారు. వారి పట్ల చాలా ప్రేమగా ఉంటారు. వీరి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా సాగుతుంది. ఎక్కడికి వెళ్లినా సెంటరాఫ్ ఎట్రాక్షన్ వీరే అవుతారు.
వ్యాపారంలో విజయం
మూల సంఖ్య 6 కలిగిన వారు చాలా కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. వీరు ఏ రంగాల్లో అయినా విజయం సాధిస్తారు. వీరికి డబ్బుకు లోటు రాదు. వీరు వినూత్నంగా ఆలోచిస్తారు. అందరితో పోలిస్తే భిన్నంగా ఏదైనా చేయాలని కోరుకుంటారు. వీరు మోడలింగ్, సంగీతం, ఫ్యాషన్ డిజైనింగ్ రంగాల్లో రాణించే అవకాశం ఉంది. ఇక వ్యాపారంలో అడుగు పెట్టిన వీరికి విజయం, ఆర్ధిక లాభాలు పుష్కలంగా దొరుకుతాయి.

