నేడు ఓ రాశివారికి అధికారులతో వివాదాలు తప్పవు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 27.11.2025 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఉద్యోగాలలో అధికారులతో చిన్నపాటి వివాదాలుంటాయి.
వృషభ రాశి ఫలాలు
దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి . ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు.
మిథున రాశి ఫలాలు
చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. బంధు మిత్రులతో సక్యతగా వ్యవహారిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.
కర్కాటక రాశి ఫలాలు
సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. దైవచింతన కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడి తప్పదు.
సింహ రాశి ఫలాలు
ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు.
కన్య రాశి ఫలాలు
ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. సన్నిహితులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
తుల రాశి ఫలాలు
పాత మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. రుణయత్నాలు వేగవంతం చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులుంటాయి.
వృశ్చిక రాశి ఫలాలు
సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.
ధనుస్సు రాశి ఫలాలు
పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు.
మకర రాశి ఫలాలు
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. నూతన వస్తు లాభాలు పొందుతారు. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది.
కుంభ రాశి ఫలాలు
నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహన్నిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.
మీన రాశి ఫలాలు
చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయటా గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు.

