Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు మందు, మాంసం ముట్టకూడదని తెలుసా?
Birth Date: జోతిష్యశాస్త్రం ప్రకారం శక్తివంతమైన గ్రహాలతో ముడిపడి ఉంటుంది. సూర్యుడు, కేతువు, బృహస్పతి, చంద్రుడు, శని ప్రభావంతో జన్మించినవారు ఆల్కహాల్, మాంసం లాంటివి ముట్టుకోకూడదు.

Birth Date
జోతిష్యశాస్త్రం, న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు, వాటిని పాలించే గ్రహాలు మనం చేసే అన్ని పనులకు అనుకూలంగా ఉండవు. అటువంటి కార్యకలాపాల్లో పాల్గొంటే దురదృష్టం పెరిగే అవకాశం ఉంది. మరి, న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీల్లో పుట్టిన వారు పొరపాటున కూడా ఆల్కహాల్, మాంసం తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం...
నెంబర్ 1..
ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారు నెంబర్ 1 కిందకు వస్తారు. వీరిని సూర్య గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు సాత్విక ఆహారమే తీసుకోవాలి. అంతేకాదు.. ఈ తేదీల్లో పుట్టిన వారు ఆల్కహాల్ తీసుకోవడం, మాంసం తినడం లాంటివి అస్సలు చేయకూడదు. పొరపాటున వీరు ఈ రెండూ చేస్తే.. నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే అవకాశం ఉంది.
నెంబర్ 7..
ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 7 కిందకు వస్తారు ఈ తేదీల్లో పుట్టిన వారిపై కేతు గ్రహ ప్రభావం ఉంటుంది. ఇదొక ఛాయా గ్రహం అయినప్పటికీ, ఇది ఆధ్యాత్మికతను సూచిస్తుంది. కాబట్టి.. ఈ తేదీల్లో పుట్టిన వారంతా మందు సేవించడం మంచిది కాదు. దీని వల్ల వీరికి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
నెంబర్ 3..
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిని గురు గ్రహం పాలిస్తుంది. అందుకే ఈ తేదీల్లో పుట్టిన వారు కూడా మందు, మాంసం జోలికి వెళ్లకూడదు. దీని వల్ల ఈ తేదీల్లో పుట్టిన వారి నెగిటివ్ ఎనర్జీ దూరం పెరగడమే కాకుండా.. అదృష్టం కూడా దూరం అవుతుంది.అనవసరపు చిక్కుల్లో పడిపోతారు.
నెంబర్ 8...
ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 8 కిందకు వస్తారు. వీరిని శని గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు కూడా ఇలాంటి పనులు చేయకూడదు. వీలైనంత వరకు వీరు ఆల్కహాల్, మాంసాహారాలకు దూరంగా ఉండాలి. లేకపోతే దురదృష్టం వెంటాడుతుంది. జీవితంలో అడ్డంకులు, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శని కోపానికి కూడా గురౌతారు.

