Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు లైఫ్ లో కచ్చితంగా ఫేమస్ అవుతారు..!
Birth Date: న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వారు జీవితంలో పేరు, ప్రతిష్ఠలు పొందుతారు. అంతేకాదు వారు చిన్న వయసులోనే ఫేమస్ అవుతారు. మరి, ఆ స్పెషల్ తేదీలేంటో చూద్దామా....

నెంబర్ 1 ( పుట్టుకతోనే స్టార్డమ్)...
ఏ నెలలో అయినా 1వ తేదీలో పుట్టిన వారు చాలా తొందరగా ఫేమస్ అవుతారు. వీరు చిన్న వయసు నుంచే అందరిలో కంటే ప్రత్యేకంగా కనిపిస్తారు. వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు తమ మాట తీరు, వ్యక్తిత్వంతో అందరినీ ఆకర్షిస్తారు. వీరిపై సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు జీవితంలో ఏదైనా సాధించగలం అనే పట్టుదలతో ఉంటారు. వారు అనుకున్నట్లుగానే సాధించి తీరతారు. ఎలాంటి ఆటంకాలు వచ్చినా పెద్దగా పట్టించుకోరు. వీరు చిన్న వయసులోనే స్టార్డమ్ సంపాదించుకుంటారు.
నెంబర్ 7...
ఏ నెలలో అయినా 7వ తేదీలో జన్మించిన వారు కూడా చిన్న వయసులోనే చాలా ఫేమస్ అవుతారు. వీరు చాలా నిశ్శబ్దంగా ఉంటారు. వీరి కంటే.. వీరు చేసే పని ఎక్కువగా మాట్లాడుతుంది. వీరు తమ చేతలతో అందరినీ ఆకర్షిస్తారు. కళా రంగంలో ఎక్కువ గుర్తింపు పొందుతారు. ఎక్కువ మంది హృదయాలను గెలుచుకుంటారు.
నెంబర్ 15...
ఏ నెలలో అయినా 15వ తేదీలో జన్మించిన వారు కూడా బాగా ఫేమస్ అవుతారు. మంచి లేదా చెడు ఏదో ఒకటి చేసి అయినా వీరు ఫేమస్ అవ్వాలని అనుకుంటారు. అలానే అయిపోతారు కూడా. వీరు అందరికీ ప్రేమను పంచుతారు. వీరి ప్రేమకు అందరూ ఎట్రాక్ట్ అవుతారు.
నెంబర్ 23..
ఏ నెలలో అయినా 23వ తేదీలో పుట్టిన వారు కూడా చిన్న వయసులోనే ఫేమస్ అవతారు. వీరు చాలా బాగా మాట్లాడగలరు. వీరు మాట్లాడుతుంటే ఎవరైనా వింటూ ఆగిపోతారు. మాటలతో మనసులు గెలుచుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. వీరి తమ మాటలతోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంటారు. ఇక.. వీరికి అదృష్టం కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. అది కూడా వీరి ఎదుగుదలకు హెల్ప్ అవుతుంది.

