Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు నిజాలు మాట్లాడి, కష్టాలు తెచ్చుకుంటారు..!
కొందరు ఏది మాట్లాడాలన్నా నిజాయితీగా, ఎలాంటి ద్వాంద్వార్థాలే లేకుండా మాట్లాడతారు. పొరపాటున కూడా అబద్ధం చెప్పాలనే ఆలోచన కూడా వారి మనసులో రానివ్వరు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఒక్కో వ్యక్తిత్వం కలిగి ఉంటారు. కొందరు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతూ ఉంటారు. అవసరానికి, సరదాగా అబద్ధాలు చెప్పేవారు మరి కొందరు ఉంటారు. కానీ, లైఫ్ లో ఎలాంటి పరిస్థితి ఏర్పడినా కూడా అబద్ధం చెప్పడానికి ఇష్టపడరు. వీరు ఎప్పుడూ నిజం మాత్రమే మాట్లాడతారు. న్యూమరాలజీ ప్రకారం కూడా కొన్ని తేదీల్లో పుట్టిన వారు కూడా ఎప్పుడూ అబద్ధం చెప్పరు. వారు నిద్రలో లేపి అడిగినా, కలలో కూడా అబద్ధం చెప్పడానికి ఇష్టపడరు. నిజం మాత్రమే మాట్లాడతారు.నిజం మాట్లాడటం వల్ల ఎవరైనా ఏమైనా ఫీలౌతారా? ఎవరైనా ఇబ్బంది పడతారా అనే విషయం కూడా వారు ఆలోచించరు. ధైర్యంగా చెబుతారు. మరి, ఆ తేదీలేంటో ఓసారి చూద్దామా..
న్యూమరాలజీ ప్రకారం మనం పుట్టిన తేదీ మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. కొంత మందికి జన్మతః కొన్ని లక్షణాలు వస్తాయి. చిన్నతనం నుంచే వారిలో ఆ లక్షణాలు మనకు క్లియర్ గా కనపడతాయి. అంటే కొందరు ఏది మాట్లాడాలన్నా నిజాయితీగా, ఎలాంటి ద్వాంద్వార్థాలే లేకుండా మాట్లాడతారు. పొరపాటున కూడా అబద్ధం చెప్పాలనే ఆలోచన కూడా వారి మనసులో రానివ్వరు.
ఏ నెలలో అయినా 1, 5, 9, 14, 17, 22, 26 తేదీల్లో జన్మించిన వారిలో ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. వారు నిజం చెప్పడంలో కొంచెం కూడా సంకోచించరు. తాము చెబుతున్నది నిజమే అయినప్పుడు ఎవరి గురించో ఆలోచించాల్సిన అవసరం ఏముంది అనే భావన కలిగి ఉంటారు. అందరికంటే, వీరు మాత్రమే ఎందుకు భిన్నంగా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం..
1వ తేదీ: ఈ తేదీన పుట్టిన వారు తమ అభిప్రాయాన్ని నిబద్ధతతో, ధైర్యంగా చెప్పగలరు. వారిలో నాయకత్వ లక్షణాలు స్పష్టంగా ఉంటాయి.
5 & 26 తేదీలు: పదునైన మనస్సు, హాస్యభరితంగా మాట్లాడే తత్వం వీరికి సహజం. ఏ విషయాన్నైనా స్పష్టంగా చెప్పగలరు.
9వ తేదీ: ఈ తేదీల్లో పుట్టిన వారు ఎమోషనల్ గా ఉంటారు, కానీ వీరు నిజాయితీతోనే ముందుకు సాగతారు, అయితే కొన్నిసార్లు వాళ్ల మాటలు కొంత మందిని అసౌకర్యానికి గురిచేయొచ్చు.
14 & 17 తేదీలు: చురుకైన మేధస్సుతో, ధైర్యంగా వ్యవహరించే వీరు సాధారణంగా ఇతరుల ప్రయోజనాల కోసం నిలబడతారు.
22వ తేదీ: వీరు మాయమాటలకు తలవంచరు. నిజమైన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పే ధైర్యాన్ని కలిగి ఉంటారు.
వీరు మాట్లాడే మాటలకు ఎప్పుడూ పాజిటివ్ స్పందన రాదు. కొన్నిసార్లు వారి మాటలను అందరూ ప్రశంసిస్తే, మరి కొన్ని సార్లు.. చాలా మంది అసౌకర్యంగా ఫీలయ్యే అవకాశం ఉంది. వీరి నిజాయితీ, నిజం మాట్లాడే వ్యక్తిత్వమే వీరిని కొన్నిసార్లు సమస్యల్లోకి నెట్టేస్తుంది. స్నేహితులు, బంధువులను దూరం చేస్తుంది.
ఈ రకం వ్యక్తిత్వం కొన్నిసార్లు భిన్నమైన స్పందనలను తెచ్చిపెడుతుంది. కొన్ని సందర్భాల్లో, వాళ్ల స్పష్టతను ప్రశంసిస్తారు; మరికొన్ని సందర్భాల్లో, అదే నేరుగా ఉండటం వల్ల కొంత మంది అసౌకర్యంగా ఫీలవుతారు. ఫైనల్ గా ఏంటంటే.. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువ శాతం నిజాలు మాట్లాడి..కష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు.