Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు ఎంత మంచివారంటే.. శత్రువులను కూడా ప్రేమిస్తారు..!
ఎవరికి ఏ అవసరం వచ్చినా వీరే ముందుంటారు. ఎవరికైనా సహాయం చేసేటప్పుడు మనవాళ్లా కాదా అని ఏ మాత్రం ఆలోచించరు. ఆపదలో ఉన్నది శత్రువు అయినా ఒక్క సెకను కూడా ఆలోచించకుండా తమకు తూచిన సహాయం అందిస్తారు.

Birth date
జోతిష్యశాస్త్రం మన జీవితంపై చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుందో.. న్యూమరాలజీ కూడా అంతే ప్రభావితం చేస్తుంది. ఈ సంఖ్యాశాస్త్రం ఆధారంగా మనం వ్యక్తుల వ్యక్తిత్వాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన వారి మనసు చాలా మంచిది. సహజంగానే వారు ఇతరుల పట్ల కరుణ, ప్రేమ, దాతృత్వాన్ని చూపుతారు. వారు ఎంత మంచివారంటే తమ శత్రువులను కూడా ప్రేమించగలరు.మరి, ఆ తేదీలేంటో చూసేద్దామా...
నెంబర్ 2..
ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 2 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారి హృదయం చాలా మంచిది. వీరి మనసు వెన్న లాంటిది. వీరు సహజంగానే కరుణామయులు. అందరి పట్ల సానుభూతితో వ్యవహరిస్తారు. ఇతరుల బాధను తమ సొంత బాధగా భావిస్తారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా వీరే ముందుంటారు. ఎవరికైనా సహాయం చేసేటప్పుడు మనవాళ్లా కాదా అని ఏ మాత్రం ఆలోచించరు. ఆపదలో ఉన్నది శత్రువు అయినా ఒక్క సెకను కూడా ఆలోచించకుండా తమకు తూచిన సహాయం అందిస్తారు. అంతేకాదు.. బాధలో ఉన్నవారిని ఓదార్చడంలోనూ ముందుంటారు.
నెంబర్ 9..
ఏ నెలలో 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 9 కిందకు వస్తారు. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో జన్మించిన వారి మనసు కూడా చాలా గొప్పది. వీరు మానవతావాదులు. ఇతరులకు సహాయం చేయడంలో, సేవ చేయడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. సమాజంలో మంచి మార్పు తీసుకురావాలనే ఆశయంతో ముందడుగు వేస్తారు. ఇతరుల కోసం నిరంతరం శ్రమిస్తారు. వీరికి స్వార్థం అంటే తెలీదు. నిస్వార్థంగా జీవిస్తారు.
నెంబర్ 4..
ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 4 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారు చాలా విశ్వసనీయులు. బాధ్యతగా ఉంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులకు జీవితాంతం తోడుగా నిలుస్తారు. నమ్మకానికి మారుపేరు అని చెప్పొచ్చు. ఏ పరిస్థితుల్లో అయినా వీరు ఎవరికైనా సహాయం చేయడానికి ముందుంటారు.
నెంబర్ 6...
ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 6 కిందకు వస్తారు. వీరు అందరికీ ప్రేమ పంచడంలో ముందుంటారు. తమ కుటుంబ సభ్యుల పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు. చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. అందరికీ మేలు చేయడంలో ముందుంటారు.
నెంబర్ 3..
ఏ నెలలో అయినా 3,12, 21, 30 తేదీల్లో జన్మించిన వారు జీవితంలో ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. వీరు ఉత్సాహంగా ఉండటమే కాదు.. అందరికీ ఉత్సాహాన్ని పంచడంలో ముందుంటారు. ప్రేమ, సానుభూతి చూపడంలో ముందుంటారు. వీరు తమ సమయాన్ని, శక్తిని ఇతరులతో పంచుకునే ధోరణి కలిగి ఉంటారు.
మొత్తంగా, ఈ తేదీల్లో జన్మించినవారు ఇతరుల మేలు కోరుతూ, మంచి భావోద్వేగాలు పంచుతూ, అందరికీ ఆప్యాయత పంచుతుంటారు. మీరు లేదా మీకు తెలిసిన వారు ఈ తేదీల్లో జన్మించి ఉంటే, నిజంగా వీరు గొప్ప మనసు ఉన్నవారే.