Pearl Ring: ముత్యం ఉంగరం ఏ చేతికి పెట్టుకోవాలో తెలుసా?
జోతిష్యశాస్త్రంలో, గ్రహాల ఆధారంగా ఉంగరాన్ని ధరించడం చాలా శుభ్రపదమని భావిస్తారు. అదేవిధంగా, చంద్రుని శాంతి కోసం ముత్యాలను ధరించడం శుభప్రదంగా భావిస్తారు.
- FB
- TW
- Linkdin
Follow Us

ముత్యాలు ధరిస్తున్నారా?
జోతిష్యశాస్త్రంలో నవగ్రహాలు ఉంటాయి. ఒక్కో గ్రహానికి ఒక్కో రత్నం ని కేటాయించారు. అదేవిధంగా ముత్యాన్ని చంద్రుని రత్నంగా భావిస్తారు. జోతిష్యం ప్రకారం చంద్రుడు శాంతికి మరోపేరుగా పరిగణిస్తారు. అలాంటి స్వభావాలే ముత్యంలోనూ ఉంటాయి. ముత్యం ధరించడం వల్ల ఆ వ్యక్తి మనసులోని అన్ని నెగిటివ్ ఆలోచనలు తొలగిపోతాయని, ప్రశాంతంగా ఉంటారని నమ్ముతారు.
అంతేకాదు.. పెళ్లైన వారు ముత్యం ధరించడం వల్ల తమ భాగస్వామితో ఏవైనా విభేదాలు ఉన్నా అవి తొలగిపోతాయి. దీంతో.. దంపతుల మధ్య సంబంధం కూడా మధురంగా మారుతుంది. చదువులో ఆసక్తి చూపించని విద్యార్థులు కూడా ముత్యం ధరించడం వల్ల.. చదువు పట్ల ఆసక్తి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే.. ఎక్కువ మంది ముత్యాలు ధరించడానికి ఇష్టపడతారు.
అయితే, ముత్యం ధరించే ముందు కొన్ని విషయాలు మాత్రం కచ్చితంగా తెలుసుకోవాలి. దానిని ఏ చేతికి, ఏ వేలుకి ధరించడం వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏ చేతికి ధరించాలి?
ముత్యం ధరించడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలగాలి అంటే..దానిని సరైన చేతికి, సరైన వేలుకి ధరించడం చాలా ముఖ్యం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి ఎక్కువగా ఉపయోగించే చేతికి ముత్యపు ఉంగరాన్ని ధరించాలని చెబుతారు. ఉదాహరణకు, ఎవరైనా తన కుడి చేతిని ఎక్కవగా పనికి ఉపయోగిస్తే, అతను తన కుడి చేతికి ముత్యపు ఉంగరాన్ని ధరించాలి ఎందుకంటే ఇది శుభ ఫలితాలను ఇస్తుంది.
మరి ఏ వేలుకి ధరించాలి?
ఏ రోజు ధరించాలి?
ఏ రోజు ధరించడం మంచిదో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. హిందూ మతంలో, శుభ సమయంలో ఏదైనా పని చేయడం ఫలవంతమని గుర్తుంచుకోండి. అటువంటి పరిస్థితిలో, శుక్ల పక్షంలో ఏదైనా సోమవారం ముత్యపు ఉంగరాన్ని ధరించడం శుభప్రదం. అంతేకాకుండా, పౌర్ణమి రోజున దానిని ధరించడం కూడా మంచి ఫలితాన్ని అందిస్తుంది.
ధరించే ముందు ఏం చేయాలి?
ముత్యాల ఉంగరాన్ని ధరించే ముందు, దానిని గంగాజలం లేదా పచ్చి ఆవు పాలలో 10 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాతే ఉంగరాన్ని ధరించాలి. అంతేకాకుండా..ఈ ఉంగరాన్ని ధరించే ముందు, ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అప్పుడు ఫలితాలు ఇంకా బాగా వచ్చే అవకాశం ఉంది.