MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac Signs: మీన రాశిలో పంచగ్రహ కూటమి.. ఈ 5 రాశుల వారికి చుక్కలే..!

Zodiac Signs: మీన రాశిలో పంచగ్రహ కూటమి.. ఈ 5 రాశుల వారికి చుక్కలే..!

ఒకే రాశిలో 5 గ్రహాలు కలిసి ఉండటాన్ని పంచగ్రహ కూటమి అంటారు. జ్యోతిష్య శాస్త్రంలో పంచగ్రహ కూటమికి చాలా ప్రాధాన్యం ఉంది. మార్చి నెలాఖరులో ఏర్పడిన పంచగ్రహ కూటమి వల్ల 5 రాశుల వారికి కష్టాలు తప్పవట. ఆ రాశులెంటో వారికి వచ్చే ఇబ్బందులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. 

1 Min read
Author : Kavitha G
Published : Mar 31 2025, 02:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశిలో అయినా గ్రహాల కలియిక ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది. అవి అనుకూల ఫలితాలు కావచ్చు. ప్రతికూల ఫలితాలు కావచ్చు. మీన రాశిలో పంచగ్రహ కూటమి మార్చి 29 రాత్రి ఏర్పడింది. దీని వల్ల 5 రాశులవారికి అశుభ ఫలితాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆ రాశులెంటో ఇక్కడ తెలుసుకుందాం.

మేష రాశి వారిపై పంచగ్రహ ప్రభావం?

పంచగ్రహ కూటమి ప్రభావంతో మేష రాశి వారి జీవితంలో ఆటంకాలు వస్తాయి. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో బాధపడతారు. ఉద్యోగులు ఆందోళన చెందుతారు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
మిథున రాశి వారిపై ప్రభావం..

మిథున రాశి వారిపై ప్రభావం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల మిథున రాశి వారికి వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇంట్లో ఆడపిల్లలకు ఇబ్బందులు వస్తాయి. పాత అప్పుల వల్ల టెన్షన్ పెరుగుతుంది. పెళ్లయిన వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటారు.
 

35
కన్య రాశి వారిపై పంచగ్రహ కూటమి ప్రభావం?

కన్య రాశి వారిపై పంచగ్రహ కూటమి ప్రభావం?

మీన రాశిలో పంచగ్రహ కూటమి కన్య రాశి వారికి అస్సలు మంచిది కాదు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయి. ప్రేమలో ఉన్న వాళ్ల బంధం తెగిపోవచ్చు. పాత అప్పుల వల్ల వ్యాపారులు ఇబ్బంది పడతారు. ఉద్యోగులకు మానసిక ఒత్తిడి అధికమవతుంది.

45
వృశ్చిక రాశి ఫలితాలు..

వృశ్చిక రాశి ఫలితాలు..

పంచగ్రహ కూటమి ప్రభావం ఏప్రిల్ 13, 2025 వరకు వృశ్చిక రాశి వారిపై ఉంటుంది. కొందరు పని చేయడానికి ఇష్టపడరు. డబ్బు గురించి టెన్షన్ పడతారు. గతంలో ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే ఇప్పుడు ఇబ్బంది పడతారు. ఇంట్లో గొడవలవుతాయి. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది.

55
మీన రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

మీన రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

మీన రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల వారికి చాలా సమస్యలు వస్తాయి. ఏప్రిల్ 13, 2025 వరకు ఎవరి దగ్గరా అప్పు చేయకపోవడం మంచిది. ఒకవేళ చేస్తే తిరిగి చెల్లించలేరు. 65 ఏళ్లు పైబడిన వాళ్లు ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి.
 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Astrology Predictions: ఈ 6 రాశులవారికి రాజయోగం.. ఆరు నెలల వరకు డబ్బే డబ్బు!
Recommended image2
Guru Chandra Conjunction: గురు చంద్రుల కలయికతో ఆ 4 రాశుల వారే లక్కీ రాజాలు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగ యోగం.. ప్రముఖులతో పరిచయాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved