Palmistry: అర చేతిలో ఈ రేఖ ఉంటే..పెళ్లి తర్వాత మీకు రాజయోగమే..!
Palmistry: హస్తసాముద్రికం( Palmistry) ప్రకారం, మన అరచేతిలోని రేఖలు మన జీవితంలోని వివిధ దశలను సూచిస్తాయి. ముఖ్యంగా చేతిలో ఉండే కొన్ని రేఖలు.. పెళ్లి తర్వాత మన అదృష్టాన్ని ఎలా మారుస్తాయి.

Palmistry
జోతిష్యశాస్త్రం, న్యూమరాలజీ ఆధారంగా మన భవిష్యత్తు ఎలా తెలుసుకోవచ్చో.. హస్తసాముద్రికం ఆధారంగా కూడా మన జాతకం తెలుసుకోవచ్చు. చేతిలోని గీతలు మన తలరాతను నిర్ణయిస్తాయని చాలా మంది నమ్ముతారు.మరీ ముఖ్యంగా.. చేతిలో కొన్ని రకాల గీతలు ఉంటే.. పెళ్లి తర్వాత రాజయోగం కలుగుతుందట. మరి, ఆ గీతలు ఏంటో చూద్దాం...
1.అదృష్ట రేఖ...
చంద్ర పర్వతం నుండి అదృష్ట రేఖ( Fate Line) ఉంది అంటే.. వారి అదృష్టానికి తిరుగులేనట్లే. అరచేతిలో కింద భాగంలో, బొటనవేలికి అవతలి వైపు ఉండే ఎత్తుగా ఉన్న భాగాన్ని చంద్ర పర్వతం అంటారు. ఒకవేళ మీ అదృష్ట రేఖ( మధ్య వేలు కిందికి వెళ్లే గీత) ఈ చంద్ర పర్వతం నుండి ప్రారంభమైతే, మీకు పెళ్లి తర్వాత విపరీతమైన ధనలాభం కలుగుతుంది. దీని అర్థం.. మీ జీవితంలోకి వచ్చే ( భార్య లేదా భర్త) మీకు అదృష్ట దేవతలా కలిసి వస్తారు. విపరీతంగా డబ్బు సంపాదిస్తారు.
2. అదృష్ట రేఖను కలిసే మరో చిన్న రేఖ..
మీ అదృష్ట రేఖ మణికట్టు నుండి పైకి వెళ్తున్నప్పుడు, చంద్ర పర్వతం నుండి వచ్చిన మరో చిన్న రేఖ దానిని కలిస్తే.. అది పెళ్లి తర్వాత విజయాన్ని సూచిస్తుంది. ఈ గీత ఉన్నవారికి... పెళ్లి తర్వాత విదేశీ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. విదేశాల్లో స్థిరపడే అవకాశాలు కూడా ఉన్నాయి.
3. గురు పర్వతంపై 'X' (Cross) గుర్తు
చూపుడు వేలు కింద ఉండే భాగాన్ని గురు పర్వతం (Mount of Jupiter) అంటారు.ఇక్కడ స్పష్టమైన 'X' గుర్తు ఉంటే, ఆ వ్యక్తికి చాలా ధనిక , విద్యావంతుడైన భాగస్వామి దొరుకుతారు.పెళ్లి తర్వాత సామాజిక హోదా, గౌరవం అమాంతం పెరుగుతాయి.
4. వివాహ రేఖ సూర్య పర్వతం వైపు వెళ్లడం..
చిటికెన వేలు కింద ఉండే చిన్న అడ్డ గీతను వివాహ రేఖ అంటారు. ఈ గీత పొడవుగా ఉండి, ఉంగరపు వేలు కింద ఉండే సూర్య పర్వతం (Mount of Sun) వైపు సాగితే, పెళ్లి తర్వాత మీకు భారీగా ఆస్తి కలిసి వస్తుంది. సమాజంలో సెలబ్రిటీ హోదా లేదా రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుంది.
5. శుక్ర పర్వతం బాగుండటం
బొటనవేలు కింది భాగాన్ని శుక్ర పర్వతం (Mount of Venus) అంటారు. ఇది ఎత్తుగా, స్పష్టంగా, ఎటువంటి అడ్డదిడ్డమైన గీతలు లేకుండా ఉంటే.. పెళ్లి తర్వాత జీవితం విలాసవంతంగా మారుతుంది.
హస్తసాముద్రికం అనేది ఒక సూచన మాత్రమే. పురుషులకు సాధారణంగా కుడి చేయి, స్త్రీలకు ఎడమ చేయి చూడటం ఆనవాయితీ. అయితే, ప్రస్తుత కాలంలో నిపుణులు రెండు చేతులను పరిశీలించి ఫలితాలను చెబుతున్నారు.

