Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అదృష్టయోగం, పట్టిందల్లా బంగారమే!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 11.11.2026 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. వ్యాపారాలలో శ్రమ తప్పదు.
వృషభ రాశి ఫలాలు
ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థికంగా కొంత మేలైన సౌకర్యాలుంటాయి. చిన్ననాటి మిత్రులతో మనస్పర్థలు తొలగుతాయి.
మిథున రాశి ఫలాలు
సంతాన విద్యా విషయాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిరుత్సాహం తప్పదు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సన్నిహితులతో ఒక వ్యవహారంలో మనస్పర్థలు కలుగుతాయి.
కర్కాటక రాశి ఫలాలు
బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఇంటా బయటా సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.
సింహ రాశి ఫలాలు
నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. సకాలంలో పనులు పూర్తికాక చికాకులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు ఉంటాయి. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
కన్య రాశి ఫలాలు
అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. ఆప్తుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.
తుల రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చేపట్టిన పనులలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
ముఖ్యమైన పనులలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా బయటా ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది. నూతన రుణ యత్నాలు నిదానంగా సాగుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
మిత్రులతో అకారణంగా కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మంచిదికాదు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి.
మకర రాశి ఫలాలు
సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు మరింత సానుకూలంగా సాగుతాయి.
కుంభ రాశి ఫలాలు
ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.
మీన రాశి ఫలాలు
నిరుద్యోగుల కష్టం ఫలించదు. నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిది. సంతాన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మాటలు కొంత నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.












