MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై శని అనుగ్రహం ఎక్కువ, ఎప్పుడూ మంచే చేస్తాడు..!

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై శని అనుగ్రహం ఎక్కువ, ఎప్పుడూ మంచే చేస్తాడు..!

జోతిష్యంలోనే కాదు, న్యూమరాలజీలోనూ శనిని చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. శనిని మన కర్మలకు ఫలితంగా పరిగణిస్తారు. కొన్ని తేదీల్లో పుట్టిన వారికి శని ఎక్కువ సమస్యలు తీసుకువస్తే, కొన్ని తేదీల్లో పుట్టిన వారికి శని మేలు చేస్తుంది

2 Min read
Author : ramya Sridhar
Published : May 20 2025, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శని మేలు చేసే  తేదీలు..
Image Credit : Freepik

శని మేలు చేసే తేదీలు..

వైదిక జోతిష్యం, సంఖ్యాశాస్త్రం రెండూ హిందూ ధర్మంలో అంతర్గతంగా చేరిన ప్రాచీన శాస్త్రాలు. జోతిష్య శాస్త్రంలో వ్యక్తి జన్మ సమయాన్ని ఆధారంగా గ్రహాల స్థితి, రాశి, నక్షత్రాల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తారు. అదేవిధంగా న్యూమరాలజీలో పుట్టిన తేదీ ఆధారంగా మనిషి వ్యక్తిత్వం, ఆలోచనా ధోరణి, ప్రవర్తనా విధానాలు తెలుసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సంఖ్యాశాస్త్రంలో శని ప్రభావం..
Image Credit : Freepik

సంఖ్యాశాస్త్రంలో శని ప్రభావం..

ఇక.. జోతిష్యంలోనే కాదు, న్యూమరాలజీలోనూ శనిని చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. శనిని మన కర్మలకు ఫలితంగా పరిగణిస్తారు. కొన్ని తేదీల్లో పుట్టిన వారికి శని ఎక్కువ సమస్యలు తీసుకువస్తే, కొన్ని తేదీల్లో పుట్టిన వారికి శని మేలు చేస్తుంది.మరి, ఏ తేదీల్లో పుట్టిన వారికి శని అదృష్టాన్ని తెస్తుందో తెలుసుకుందాం..

35
8, 17, 26 తేదీల ప్రత్యేకత
Image Credit : Freepik

8, 17, 26 తేదీల ప్రత్యేకత

సంఖ్యాశాస్త్రం ప్రకారం 8, 17, 26 తేదీల్లో జన్మించినవారిని అదృష్టవంతులుగా పేర్కొంటారు. ఈ తేదీలను కలిపితే వచ్చే సంఖ్య "8" (1+7=8, 2+6=8) కాబట్టి వీరి రాడిక్స్ సంఖ్య 8 అవుతుంది. ఈ సంఖ్య అధిపతి శని గ్రహం. శని దేవుడు కర్మ, న్యాయం, బాధ్యతకు ప్రతీక. క్రమశిక్షణతో జీవించే వారిని శని ఆశీర్వదిస్తాడు. అంటే, ఈ రాశివారికి శని దయ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

45
ఈ తేదీల్లో పుట్టిన వారిలో ఉండే స్పెషల్ లక్షణాలు..
Image Credit : Freepik

ఈ తేదీల్లో పుట్టిన వారిలో ఉండే స్పెషల్ లక్షణాలు..

ఆత్మవిశ్వాసం: 8వ సంఖ్య కలవారిలో ధైర్యం, నమ్మకం, ఒక ఆత్మస్థైర్యం స్పష్టంగా కనిపిస్తుంది.

తెగువ & పట్టుదల: ఒక పని ప్రారంభిస్తే దానిని పూర్తి చేసే వరకు వదలకుండా ప్రయత్నిస్తారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలబడి విజయం సాధించగలరు.

పెట్టుబడుల పట్ల ఆసక్తి: వ్యాపార వ్యతిరేకత కంటే వ్యాపారాశయం ఎక్కువగా ఉంటుంది. డబ్బును సంపాదించడమే కాదు, పెట్టుబడులు కూడా జాగ్రత్తగా పెట్టి, విజయం సాధించగలరు.

అగ్రగామిత్వ లక్షణాలు: నాయకత్వ లక్షణాలు బలంగా ఉంటాయి. సమాజంలో గౌరవం పొందుతారు. తాము ఉన్న ప్రదేశంలో ప్రభావాన్ని చూపగలరు.

భవిష్యత్ దృష్టి: భవిష్యత్తు కోసం ముందుగానే ప్రణాళికలు వేయడం, తగిన చర్యలు తీసుకోవడం వీరి ప్రాధాన్య లక్షణం.

55
శని అనుగ్రహం
Image Credit : Freepik

శని అనుగ్రహం

శని దేవుడు సుతిమెత్తని దారిని చూపించడని, కఠినమైన పాఠాల ద్వారా జీవితం ఎలా సాగించాలో నేర్పిస్తాడని జ్యోతిష నిపుణులు చెబుతారు. అయినా, 8వ సంఖ్యవారు మంచి పనులు చేస్తే, ధార్మికంగా జీవిస్తే శని అనుగ్రహం వారి జీవితాన్ని మారుస్తుంది. ఎప్పుడూ కర్మపై నమ్మకం ఉంచే వారు, శ్రమను మించిన ఫలితాలు పొందుతారు.

ఈ తేదీల్లో పుట్టిన వారికి కలిసొచ్చే రంగులు..

నీలం రంగు (Neelam) – శనికి ప్రీతికరమైన రంగు. ముఖ్యమైన రోజుల్లో నీలం రంగు దుస్తులు ధరించడం మంచిది.

శనివారం ఉపవాసం – శనివారాల్లో నియమంగా శని వ్రతం చేయడం శుభప్రదం.

నల్ల నువ్వులు దానం – నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనె దానం చేయడం శని అనుగ్రహానికి మార్గం.

ఫైనల్ గా...

8, 17, 26 తేదీల్లో జన్మించినవారు కేవలం అదృష్టవంతులే కాకుండా, శ్రమ, నిబద్ధత, సమర్థత కలిగి ఉంటారు. శని అనుగ్రహం పొందాలంటే నీతి మార్గంలో నడవాలి, నిజాయితీతో జీవించాలి. అప్పుడు ఈ సంఖ్యవారు జీవితంలో నిజమైన విజయాలను సాధించగలరు – పేరుప్రఖ్యాతులు, సంపద, గౌరవం అన్నీ తగిన సమయంలో లభిస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై శని ప్రభావం చాలా ఎక్కువ..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎవరికీ భయపడరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved