Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారి సక్సెస్ ని ఎవరూ ఆపలేరు
న్యూమరాలజీ ప్రకారం ఓ తేదీలో పుట్టిన వారు చాలా ధైర్యంగా ముందు అడుగు వేస్తారు. జీవితంలో విజయం కూడా సాధిస్తారు. మరి, ఆ తేదీలు ఏంటో చూద్దామా..

న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి జీవితం గురించి, భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు. మన పుట్టిన తేదీని కలిపి దాని మూల సంఖ్యను మనం తెలుసుకోవచ్చు. దాని ఆధారంగా.. కొన్ని మూల సంఖ్యలో పట్టిన వారు జీవితంలో కచ్చితంగా విజయం సాధిస్తారట. వారి విజయాన్ని ఎవరూ ఆపలేరట. మరి, ఆ అాదృష్ట తేదీలేంటో చూసేద్దామా..

న్యూమరాలజీలోని ప్రతి సంఖ్య.. నవ గ్రహాలతో సంబంధం ఉంటాయి. వీటి సహాయంతో ఎవరి వ్యక్తిత్వం, ప్రవర్తన, జీవితం, భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు. ఈ రోజు మనం కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వ్యక్తుల గురించి తెలుసుకుందాం.

నెంబర్ 3..
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 3 వ తేదీలో పుట్టిన వారు జీవితంలో విజయం సాధిస్తారు. నెంబర్ 3 అంటే ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీ లో పుట్టిన వారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగా ఉంటారు. చాలా నమ్మకంగా ఉంటారు. వీళ్ళకి గురుడు అధిపతి. ఇది జ్ఞానం, చదువు, మతానికి సంబంధించిన గ్రహం. అందుకే వీళ్ళు తెలివైనోళ్ళు, ముందుచూపు ఉన్నోళ్ళు. 3 నంబర్ వాళ్ళు స్వతంత్రంగా ఉంటారు. ఎవరి దగ్గరా సహాయం తీసుకోరు. ఎవరికీ అప్పు ఉండటానికి ఇష్టపడరు.కచ్చితంగా వీళ్లు కోటీశ్వరులు అవుతారు.

నెంబర్ 6...
ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టిన వాళ్ళకి మూల సంఖ్య 6. ఈ తేదీల్లో పుట్టిన వారి జీవితాల గురించి చెప్పాలంటే, వీళ్ళు హాయిగా బతుకుతారు. వీళ్ళకి ఎప్పుడూ ఏ లోటూ ఉండదు. మఖ్యంగా జీవితంలో వీరు కోరుకున్న విజయాన్ని సాధిస్తారు.
వీళ్ళు జీవితంలో కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ బాగా ఉంది. ఈ మూలాంక్ వాళ్ళని పుట్టుకతోనే కోటీశ్వరులు అంటారు. ఎందుకంటే వీళ్ళు కోటీశ్వరులు అవ్వడానికే పుడతారు. వీరి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు.

