Nara disti: నరదిష్టితో ఇంట్లో ఇబ్బంది పడుతున్నారా.? ఇలా చేస్తే వెంటనే రిజల్ట్.
నరదిష్టి అనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పనులలో ఆటంకాలు వస్తాయని అనేకమంది విశ్వసిస్తారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని పద్ధతులను పాటించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

సముద్ర జలాల ప్రభావం
సముద్ర జలాలకు నరదిష్టిని తగ్గించే శక్తి ఉందని చెబుతారు. శుక్రవారం లేదా శనివారం సముద్ర తీరానికి వెళ్లి కొంత నీరు తీసుకురావాలి. ఆ నీటిని ఇంటి చుట్టుపక్కల లేదా వ్యాపార ప్రాంగణంలో చల్లితే దోషాలు తొలగిపోతాయి. వ్యక్తిగతంగా నరదిష్టి తగ్గించుకోవాలనుకుంటే, రోజూ స్నానానికి ముందు నీటిలో కొద్దిగా దొడ్డు ఉప్పు కలిపి వాడితే మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు.
సాంబ్రాణి ధూపం ప్రత్యేకత
ఇంటిలో లేదా కార్యాలయంలో సాంబ్రాణి ధూపం వేయడం కూడా దృష్టి తొలగించే మార్గాల్లో ఒకటి. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి రోజుల్లో సాయంత్రం సమయంలో ధూపం వేయడం ద్వారా ప్రతికూల శక్తులు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఉప్పు మూట పరిహారం
మంగళవారం రోజున ఒక ఎరుపు వస్త్రంలో కొద్దిగా దొడ్డు ఉప్పు కట్టి ఇంటి ముందర లేదా దుకాణం ముందు కట్టాలి. ఆ మూటను బుధవారం రోజున తెరచి, అందులోని ఉప్పును ఎవరూ తొక్కని చెట్టు వేర్ల దగ్గర వేసుకోవాలి లేదా పారే నీటిలో వదలాలి. ఈ విధానం ప్రతి వారం చేస్తే ఇంటికి లేదా వ్యాపార స్థలానికి ఉన్న నరదిష్టి తగ్గిపోతుంది.
పసుపు–కర్పూరం మిశ్రమం
దృష్టి దోషం తొలగించేందుకు ఆవు పేడలో కొద్దిగా పచ్చకర్పూరం, పసుపు, కస్తూరి, సువాసన కలిపి, మంగళవారం ఇంటి చుట్టుపక్కల చల్లాలి. ఈ విధానం చేయడం ద్వారా ప్రతికూల శక్తులు తొలగి ఆ ప్రాంతం శుభప్రదంగా మారుతుందని నమ్మకం ఉంది.
బంగాళదుంపలతో పరిహారం
బంగాళదుంపలను ఉపయోగించి కూడా దృష్టి దోషం తొలగించవచ్చు. మంగళవారం లేదా గురువారం రోజు ఉదయం బంగాళదుంపలను ఉడికించి, తొక్క తీసి చల్లార్చి కొద్దిగా ఉప్పు కలిపి గోవుకు ఆహారంగా పెట్టాలి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు ఇలా చేస్తే నరదిష్టి ప్రభావం తగ్గిపోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.