Zodiac signs: ఈ రాశులవారు చాలా రొమాంటిక్..ఎంత ప్రేమ కురిపిస్తారో..!
Zodiac signs: జోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని రాశుల వారు లైఫ్ లో చాలా రొమాంటిక్ గా ఉంటారు. తమ జీవితంలోకి వచ్చిన జీవిత భాగస్వామిని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. వారిని రొమాన్స్ లో ముంచేస్తారు. మరి, అలాంటి రాశులేంటో చూద్దామా..

మీన రాశి...
రొమాన్స్ విషయంలో మీన రాశివారు అగ్ర స్థానంలో ఉంటారు. ఈ రాశివారు సహజంగా కలల లోకంలో విహరిస్తూ ఉంటారు. తమ కలలో ఊహించుకున్న దానిని నిజ జీవితంలో నిజం చేసుకోవాలని అనుకుంటారు. వీరు తమ భాగస్వామిని రాజ కుమారుడు లేదా రాజ కుమారిలా చూసుకుంటారు. ప్రేమ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. కవితలు రాయడం, సర్ ఫ్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వడం ఈ రాశివారి ప్రత్యేకత.
వృషభ రాశి..
రొమాన్స్ విషయంలో మీన రాశి తర్వాతి స్థానం వృషభ రాశి వారిదే. ఈ రాశిని శుక్ర గ్రహం పాలిస్తూ ఉంటుంది. వీరు చాలా గొప్పగా ప్రేమించగలరు. ఆ ప్రేమను అంతే గొప్పగా కూడా బాగా వ్యక్త పరచగలరు.
వీరు భాగస్వామికి ఇచ్చే కౌగిలింత లేదా స్పర్శలో చాలా గాఢత ఉంటుంది.క్యాండిలైట్ డిన్నర్లుకు తీసుకువెళ్లడం, సరదాగా ట్రిప్స్ కి తీసుకువెళ్లడం లాంటివి వీరు ఎక్కువగా చేస్తారు. వీరి ప్రేమకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.
తుల రాశి..
తుల రాశి వారు కూడా శుక్ర గ్రహ ప్రభావం వల్ల రొమాన్స్ పట్ల విపరీతమైన ఆసక్తి కలిగి ఉంటారు. వీరు ప్రేమలో ఒక రకమైన 'క్లాస్' 'స్టైల్' చూపిస్తారు. వీరు తమ భాగస్వామితో గడిపే ప్రతి క్షణం అందంగా ఉండాలని కోరుకుంటారు. గొడవలు లేకుండా, ఎప్పుడూ సరదాగా, రొమాంటిక్ డేట్స్‌కు వెళ్లడం వీరికి చాలా ఇష్టం.
వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశి వారి ప్రేమ చాలా లోతుగా , తీవ్రంగా (Intense) ఉంటుంది. వీరు పైన కనిపించే రొమాన్స్ కంటే మనసుల అనుసంధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
వీరు ఒకసారి ఎవరినైనా ప్రేమిస్తే, వారి పట్ల అమితమైన మక్కువ చూపిస్తారు. వీరి చూపులు, మాటలు భాగస్వామిని మంత్రముగ్ధులను చేస్తాయి. వీరి రొమాన్స్ కి జీవిత భాగస్వామి కూడా ఫిదా అయిపోతారు.

