Monthly Horoscope April 2024: ధనలాభం.. విరోధాలు.. ఎలినాటి శని.. ఏప్రిల్‌లో మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
April 2024 Horoscope : ఏప్రిల్ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఈ నెలలో ఒక రాశివారికి ధనలాభం, కొద్ది పాటి విరోధాలు, మరొక రాశివారికి ఎలినాటి శని, ఇంకోకరికి ఆర్థిక కష్టాలు కలగనున్నాయి. పలువురికి ఆదాయం మరింత కలగనుంది. మీ రాశి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం !
telugu astrology
Monthly Horoscope April 2024: మాస ఫలాలు :01 ఏప్రిల్ 2024 నుంచి ఏప్రిల్ 30 2024 వరకు
జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ మాసం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
(కర్కాటక వృశ్చిక మకర కుంభ మీన రాశి ల వారికి అష్టమ అర్ధాష్టమ మరియు ఏలినాటి శని జరుగుతున్నాయి. కావున ప్రతినిత్యం ఈ శ్లోకాన్ని 11 సార్లు లేదా శని స్తోత్రం లేదా అష్టోత్రం గాని పారాయణ చేయడం మంచిది.)
శ్లో॥ కోణస్థ పింగళో బభ్రు కృష్ణో రౌద్రాంతకోయమః ।
సౌరి శనైశ్చరో మందః పిప్పలాదిషు సంస్థితః॥
లేదా
శ్లో॥నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం॥
మేషం (అశ్విని భరణి కృత్తిక 1)
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారాలు॥ మంగళ- గురు -శుక్ర
రవి 14-4-24 వరకు వ్యయ స్థానంలో సంచారం తదుపరి జన్మ రాశిలో సంచారం. రవి సంచారం అనుకూలంగా కాదు.పుత్రులు తో కొద్దిపాటి విరోధాలు రాగలవు. ఉద్యోగాలలో అధికారులు తో చికాకులు ఏర్పడగలవు.(సంతాన ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి)
కుజుడు 23-4-24 వరకు లాభ స్థానంలో సంచారం వలన ప్రయత్నించిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. (మాస ప్రారంభం నుండి కుజ సంచారం మిక్కిలి అనుకూలంగా ఉంటుంది)తదుపరి వ్యయ స్థానంలో సంచారం వలన అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.
ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగాలలో ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. వాహన యంత్రాధులతో జాగ్రత్త అవసరం.పనుల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు అధికంగా ఉంటాయి.బంధువర్గంతో చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి.అన్ని వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి.ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.విద్యార్థులు పట్టుదలతో చదవాలి.
అశ్విని నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు ఇతరులు తో అకారణంగా విరోధాలు తలెత్తుతాయి.తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.
భరణి నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.సుఖమైన జీవితం లభిస్తుంది.విద్యావేత్తలతో పరిచయాలు లభిస్తాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
కృత్తిక నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది.దైవ భక్తి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు.సౌఖ్యమైన జీవితం పొందుతారు.
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారాలు॥ మంగళ- గురు -శుక్ర
రవి 14-4-24 వరకు లాభ స్థానంలో సంచారం తదుపరి వ్యయ స్థానంలో సంచారం. మాస ప్రారంభం నుండి అనుకూలమైన ఫలితాలు పొందగలరు. గృహంలో శుభకార్యాలు జరుగును. మా ప్రాంతంలో ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
కుజుడు 23-4-24 వరకు రాజ్య స్థానంలో సంచారం. ఈ సంచారం వలన మీరంటే గిట్టని వారు అధికమవుతాయి. తదుపరి లాభ స్థానంలో సంచారం భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
మధ్యలో ఆగిపోయిన పనులు వేగవంతం అవుతాయి ఆర్థికపరమైన విషయాలు బాగుంటాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.మానసికంగా శారీరకంగా బలపడతారు. నూతన వస్తు ఆభరణాలను వాహనాలు కొనుగోలు చేస్తారు.వృత్తి వ్యాపారంలో ధన లాభం పొందగలరు.సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి.
రోహిణి నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు సకల సౌఖ్యాలు పొందగలరు.వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందగలరు. ఈ మాసం ఆనందంగా గడుపుతారు,
మృగశిర నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.సుగంధ ద్రవ్యాలు అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు.
telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:- 3-5-6
అనుకూలమైన వారాలు॥ ఋధ -శుక్ర
రవి 14-4-24 వరకు రాజ్య స్థానంలో సంచారం తదుపరి లాభ స్థానంలో సంచారం. రవి సంచారం మిక్కిలి అనుకూలమైన ఫలితాలు పొందగలరు. అన్నదమ్ముల సహకారంతో అభివృద్ధి చెందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన పదవులు లభించును.(ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా పూర్తి కాగలవు.)
కుజుడు 23-4-24 వరకు భాగ్య స్థానంలో సంచారం తదుపరి రాజ్య స్థానంలో సంచారం వలన భార్య భర్తల మధ్య అనుకోని కలహాలు రాగలవు. చేసే పనులలో శ్రమ అధికంగా ఉంటుంది.
బంధుమిత్రులతో ఇచ్చి పుచ్చుకోవడం ఉంటాయి.అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది.కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.ఆర్థిక లావాదేవీల సంతృప్తికరంగా ఉంటాయి.సంతానం ద్వారా సౌఖ్యం లభిస్తుంది.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలు లో అంకితభావంతో వ్యవహరించాలి.గతంలో వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు.
ఆరుద్ర నక్షత్రం వారికి మాసాధిపతిరవి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శిరస్యకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రాగలవు.ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు. ఉద్యోగాలలో అధికారులు తో సమస్యలు.
పునర్వసు నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. ఇతరులతో కలహాలు విరోధాలు ఏర్పడగలవు.ముఖ్యమైన వస్తువులు తో జాగ్రత్త అవసరం. చెడు స్నేహాలు కు దూరంగా ఉండాలి.
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4 పుష్యమి ఆశ్లేష )
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారాలు॥ ఆది- సోమ
రవి 14-4-24 వరకు భాగ్య స్థానంలో సంచారం. ఆత్మీయులతో అకారణంగా విరోధాలు రాగలవు. తదుపరి రాజ్య స్థానంలో సంచారం ఆర్థిక విషయాలు బాగుంటాయి.
కుజుడు 23-4-24 వరకు అష్టమ స్థానంలో సంచారం (మాస ప్రారంభం నుండి అష్టమ కుజ సంచారం వలన సంతాన విషయంలో ఉద్యోగాలలో తగు జాగ్రత్తగా వ్యవహరించాలి)తదుపరి భాగ్య స్థానంలో సంచారం.కుజ సంచారం అనుకూలంగా లేదు. ఉద్యోగాలలో అధికారులు తో సఖ్యత గా ఉండాలి. సంతానం తో ప్రతికూల వాతావరణం.
ఈనెల సామాన్య ఫలితాలు పొందగలరు.వ్యవహారాల్లో ఆలోచనలు స్పష్టత లేక ఇబ్బందులకు గురి అవుతారు.ప్రయత్న కార్యంలో ఆటంకాలు ఎదురవుతాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు వలన బాధపడతారు.ఉన్నతమైన వ్యక్తులు తో పరిచయాలు కలిసి వస్తాయి.అనుకోని ప్రయాణం చేయవలసి ఉంటుంది.ఖర్చులు యందు ఆచితూచి వ్యవహరించాలి.వ్యవహారాల్లో పరాక్రమం చూపిస్తారు. బంధుమిత్రులు సహాయ సహకారాలు అధిష్టాయి.వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.
పుష్యమి నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు అధికారులు తో సమస్యలు రాగలవు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు లభించక ఇబ్బంది పడతారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది.
ఆశ్రేష నక్షత్రం వారికి మాసాధిపతి శని ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు రాగలవు. అకారణంగా కలహాలు రాగలవు.జంతువులు మరియు వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.
telugu astrology
సింహం (మఖ పుబ్బ ఉత్తర 1)
నామ నక్షత్రాలు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారాలు॥ ఆది- సోమ
రవి 14-4-24 వరకు అష్టమ స్థానంలో సంచారం తదుపరి భాగ్య స్థానంలో సంచారం. ఈ సంచారం వలన ప్రతికూల ఫలితాలు. పెద్దల యొక్క మాటలు వినాలి.శారీరక శ్రమ పెరుగుతుంది.
కుజుడు 23-4-24 వరకు కళత్ర స్థానంలో సంచారం తదుపరి అష్టమ స్థానంలో సంచారం. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలు దూరంగా ఉండాలి. స్థిరాస్తి విషయంలో జాగ్రత్త అవసరం. (మాసాంతం నుంచి అష్టమ కుజ కారణంగా అన్ని వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి)
ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవహారాల్లో వ్యక్తిగత పర్యవేక్షణ అవసరం.ఇతరులతో సంయమనం చేసుకొనుట తప్పనిసరి.అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.ఆరోగ్యం విషయంలో ముందు జాగ్రత్తలు పాటించాలి. అన్ని రంగాల వారికి గ్రహ సంచారం అంత అనుకూలం కాదు.చేసే పనులు లో శారీరక శ్రమ అధికంగా ఉండి అలసటకు గురి కావాల్సి వస్తుంది.సమయం కానీ సమయంలో భోజనం చేయవలసి వస్తుంది.బంధు మిత్రులతో వివాదాలు కలుగును. కుటుంబం నందు కలహాలు అశాంతి వాతావరణం ఉండును.ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి.ఆర్థికపరమైన చిక్కులు ఏర్పడతాయి.
మఘ నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు ఇతరులు తో అకారణంగా విరోధాలు తలెత్తుతాయి.తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.
పుబ్బ నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.సుఖమైన జీవితం లభిస్తుంది.విద్యావేత్తలతో పరిచయాలు లభిస్తాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
ఉత్తర నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది.దైవ భక్తి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు.సౌఖ్యమైన జీవితం పొందుతారు.
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4 హస్త చిత్త 1 2)
నామ నక్షత్రాలు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:-3-5-6
అనుకూలమైన వారాలు॥ బుధ- శుక్రవారం
రవి 14-4-24 వరకు కళత్ర స్థానంలో సంచారం. తదుపరి అష్టమ స్థానంలో సంచారం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్థలు రాగలవు. కోపావేశము తగ్గించుకోవాలి.(అష్టమ రవి సంచారం వలన అన్ని వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి)
కుజుడు 23-4-24 వరకు శతృ స్థానంలో సంచారం. తలపెట్టిన కార్యాలలో అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. తదుపరి కళత్ర స్థానంలో సంచారం వలన ఉదర సంబంధిత అనారోగ్యాలు రాగలవు.
ఉద్యోగాలు లో అంకితభావంతో వ్యవహరించాలి.కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం కష్టం. ఆదాయమును మించిన ఖర్చులు ఉంటాయి.వృత్తి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు వహించాలి.చేయు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రమే ఉంటాయి.అన్ని రంగాల వారికి ఇబ్బందులు తప్పవు.ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయి.శారీరకంగా శ్రమ అధికమవుతుంది.సమయం కానీ సమయంలో భోజనాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ వ్యక్తులు తో విభేదాలు రాగలవు.
హస్త నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు సకల సౌఖ్యాలు పొందగలరు.వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందగలరు. ఈ మాసం ఆనందంగా గడుపుతారు,
చిత్త నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.సుగంధ ద్రవ్యాలు అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు.
telugu astrology
తుల (చిత్త 3 4, స్వాతి విశాఖ 1 2 3)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారాలు॥ మంగళ -గురు- శుక్ర
రవి 14-4-24 వరకు శతృ స్థానంలో సంచారం. తదుపరి కళత్ర స్థానంలో సంచారం. శత్రువులపై పై చేయి సాధిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
కుజుడు 23-4-24 వరకు పంచమ స్థానంలో సంచారం. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తదుపరి శతృ స్థానంలో సంచారం వలన ఆర్థిక విషయాల బాగుంటాయి. ఆదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు.
గ్రహ సంచారం ప్రతికూలంగా ఉండుడిచే అన్ని విషయాలు లో ఆటంకాలు ఏర్పడతాయి. నూతనమైన పనులు ప్రారంభించ గలరు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలలో రాణింపు ఉంటుంది. ఆరోగ్య విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థికపరమైన విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం. విందులు వినోదాల్లో పాల్గొంటారు. సంతాన సౌఖ్యం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకు తగాదాలు రావొచ్చు.
స్వాతి నక్షత్రం వారికి మాసాధిపతి రవి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శిరస్యకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రాగలవు.ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు. ఉద్యోగాలలో అధికారులు తో సమస్యలు.
విశాఖ నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. ఇతరులతో కలహాలు విరోధాలు ఏర్పడగలవు.ముఖ్యమైన వస్తువులు తో జాగ్రత్త అవసరం. చెడు స్నేహాలు కు దూరంగా ఉండాలి.
telugu astrology
వృశ్చికము (విశాఖ 4, అనూరాధ జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారాలు॥ మంగళ-గురు -శుక్ర
రవి 14-4-24 వరకు పంచమ స్థానంలో సంచారం. మాస ప్రారంభం నుండి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి శతృ స్థానంలో సంచారం ఈ సంచారం అనుకూలం. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి.
కుజుడు 23-4-24 వరకు చతుర్ధ స్థానంలో సంచారం (చతుర్ద కుజ సంచారం వలన తగు జాగ్రత్తలతో వ్యవహరించాలి)తదుపరి పంచమ స్థానంలో సంచారం. ఈ సంచారం వలన కుటుంబంలో కలహాలు. శారీరక శ్రమ పెరుగుతుంది. శత్రువుల తో అపకారం జరిగే అవకాశం.
గ్రహ సంచారం మధ్యస్థంగా ఉన్నాయి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.సమాజంలో మంచి గుర్తింపు ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో సంయమనం పాటించాలి. సంతానం విషయంలో అధిక ఖర్చు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు పట్టుదలతో చదవాల్సి ఉంటుంది. ఒక్కొక్క సమయాల్లో వ్యవహారాల్లో కోపాలకు ఉద్రేకాలకు లోనవుతారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆదాయం సామాన్యంగా ఉంటుంది.శత్రువుల వలన ఇబ్బందులు తప్పవు.
అనూరాధ నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు అధికారులు తో సమస్యలు రాగలవు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు లభించక ఇబ్బంది పడతారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది.
జ్యేష్ట నక్షత్రం వారికి మాసాధిపతి శని ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు రాగలవు. అకారణంగా కలహాలు రాగలవు.జంతువులు మరియు వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.
telugu astrology
ధనుస్సు (మూల పూ.షాఢ ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారాలు॥ గురు -శుక్ర- మంగళవారం
రవి 14-4-24 వరకు చతుర్ధ స్థానంలో సంచారం. తదుపరి పంచమ స్థానంలో సంచారం. రుణ దాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగాలలో అధికారులు తో కలహాలు.
కుజుడు 23-4-24 వరకు తృతీయ స్థానంలో సంచారం వలన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి చతుర్ధ స్థానంలో సంచారం. సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నమ్మిన వారు మోసం చేయాలని చూస్తారు.
చేసే పనులు ఎందుకు దృష్టి పెట్టలేక పనులు మధ్యలో నిలిచిపోవును.సమయం కానీ సమయంలో భోజనం చేయవలసి వస్తుంది.ఆదాయ మార్గాలు తగ్గుతాయి. అనవసరమైన ఖర్చులు విపరీతం గా పెరుగుతాయి.ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి.వ్యవహారాల్లో ధైర్యంగా ఒక ప్రణాళిక పరంగా వ్యవహరించుకోవాలి.ప్రభుత్వం నుంచి సన్మాన సత్కారాలు జరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మూల నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు ఇతరులు తో అకారణంగా విరోధాలు తలెత్తుతాయి.తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.
పూ.షాఢ నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.సుఖమైన జీవితం లభిస్తుంది.విద్యావేత్తలతో పరిచయాలు లభిస్తాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
ఉ.షాఢ నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది.దైవ భక్తి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు.సౌఖ్యమైన జీవితం పొందుతారు.
telugu astrology
మకరము (ఉ.షాఢ 2 3 4 శ్రవణం ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 2-3-6-8
అనుకూలమైన వారాలు॥ ఆది -సోమ- శని
రవి 14-4-24 వరకు తృతీయ స్థానంలో సంచారం. ఈ సంచారం వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.తదుపరి చతుర్ధ స్థానంలో సంచారం వలన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
కుజుడు 23-4-24 వరకు ధన స్థానంలో సంచారం తదుపరి తృతీయ స్థానంలో సంచారం వలన వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. భూ గృహ క్రయ విక్రయాల్లో జాగ్రత్త అవసరం.
అనవసర ప్రయాణాలు అధికంగా చేయవలసి ఉంటుంది. బంధుమిత్రుల వర్గంతో కారణంగా విరోధాలు రాగలవు.అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు స్థానచలనం అయ్యే అవకాశం. తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ చివరకు కార్య సాఫల్యత చేకూరుతుంది. వ్యవహారాల్లో మనోధైర్యం తో వ్యవహరించాలి. కొన్ని సందర్భాల్లో హుందాతనం వ్యవహరించ లేరు. గతంలో చేసిన కొన్ని పొరపాట్లు కు మనోవేదనకు గురి అవుతారు. విద్యార్థులకు మధ్యస్తంగా ఉంటుంది.
శ్రవణా నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు సకల సౌఖ్యాలు పొందగలరు.వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందగలరు. ఈ మాసం ఆనందంగా గడుపుతారు,
ధనిష్ఠ నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.సుగంధ ద్రవ్యాలు అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు.
telugu astrology
కుంభం (ధనిష్ట 3 4 శతభిషం పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 1-2-6-8
అనుకూలమైన వారాలు॥ శని- ఆది -సోమ
రవి 14-4-24 వరకు ధన స్థానంలో సంచారం వలన వైవాహిక జీవితంలో చికాకులు. వివాహ ప్రయత్నాలు లో ఆటంకాలు.తదుపరి తృతీయ స్థానంలో సంచారం వలన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది.
కుజుడు 23-4-24 వరకు జన్మరాశిలో సంచారం తదుపరి ధన స్థానంలో సంచారం వలన వాహన ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవాలి. భార్య తో సఖ్యత గా ఉండాలి. (జన్మ కుజ కారణంగా అన్ని వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.)
ఇంటా బయటా సామాన్యంగా ఉంటుంది.ఆదాయం పర్వాలేదు అనిపించే విధంగా ఉంటుంది.సహోద్యోగులతో మరియు సాటివారితో లౌక్యంగా వ్యవహరించాలి. వాహన యంత్రాల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలి.క్రయ విక్రయాలు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.ప్రయాణాల్లో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉండును. శుభ కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం ఉన్నది.
శతభిషం నక్షత్రం వారికి మాసాధిపతి రవి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శిరస్యకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రాగలవు.ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు. ఉద్యోగాలలో అధికారులు తో సమస్యలు.
పూ.భాద్ర నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. ఇతరులతో కలహాలు విరోధాలు ఏర్పడగలవు.ముఖ్యమైన వస్తువులు తో జాగ్రత్త అవసరం. చెడు స్నేహాలు కు దూరంగా ఉండాలి.
telugu astrology
మీనం (పూ.భాద్ర 4 ఉ.భాద్ర రేవతి )
నామ నక్షత్రాలు
(దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారాలు॥ గురు- శుక్ర -మంగళ
రవి 14-4-24 వరకు జన్మరాశిలో సంచారం తదుపరి ధన స్థానంలో సంచారం వలన మానసిక ఆందోళన పెరుగుతుంది. వ్యవహారాల్లో మూర్ఖపు పట్టుదల వదిలి వ్యవహరించాలి.
కుజుడు 23-4-24 వరకు వ్యయ స్థానంలో సంచారం తదుపరి జన్మ రాశిలో సంచారం ఈ వలన చెడు స్నేహాలు కు మరియు దుర్మార్గ ఆలోచనలకు దూరంగా ఉండాలి.(మాసాంతం నుంచి జన్మ కుజ సంచారం జాగ్రత్త అవసరం)
ఉద్యోగస్తులు పై అధికారులతో సఖ్యతగా మెలగాలి.అభివృద్ధి ప్రయత్నం కొనసాగిస్తారు.మాసం చివరలో అధికారుల నుంచి ఒత్తిడి లు ఎదుర్కొంటారు. ఇతరులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకొనుటకు తీవ్రంగా కృషి చేస్తారు.ఏ విషయంలోనైనా ఇచ్చి పుచ్చుకోవడం లో ఉత్సాహంగా వ్యవహరిస్తారు. బంధుమిత్రుల గృహంలో జరిగే శుభకార్యాలలో కీలక పాత్ర పోషిస్తారు.ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి.దూర ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం.
ఉ.భాద్ర నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు అధికారులు తో సమస్యలు రాగలవు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు లభించక ఇబ్బంది పడతారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది.
రేవతి నక్షత్రం వారికి మాసాధిపతి శని ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు రాగలవు. అకారణంగా కలహాలు రాగలవు.జంతువులు మరియు వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.