May 2026 Horoscope: బుధుడి మాయాజాలం... మే నెలలో బంపర్ లాటరీ కొట్టేది ఈ రాశులే..!
May 2026 Horoscope: మే నెలలో బుధుడు మాయాజాలం చేయనున్నాడు. ఒకే నెలలో రెండు సార్లు తన రాశిని మార్చుకోనున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులకు లక్ష్మీ కటాక్షం కలగనుంది.

Mercury Transit
జోతిష్య శాస్త్రం ప్రకారం... గ్రహాలు తరచూ తమ రాశులను మార్చుకుంటూనే ఉంటాయి. ఇలా రాశులను మారిన ప్రతిసారీ.. కొన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. మే నెలలోనూ ఇలా మార్పులే జరగనున్నాయి. ఈ నెలలో బుధ గ్రహం రెండు సార్లు తన రాశిని మార్చుకోనుంది. మే 15 2026న వృషభ రాశిలోకి అడుగుపెట్టిన బుధుడు.. మే 29న మిథున రాశిలో సంచరించనున్నాడు. ఇలా రెండు సార్లు రాశిని మార్చుకోవడం కారణంగా కొన్ని రాశులకు ప్రయోజనాలు కలగనున్నాయి. మరి, ఆ రాశులేంటో చూద్దామా..
1.మేష రాశి...
మే నెలలో మేష రాశివారికి చాలా అద్భుతంగా ఉండనుంది. కోరుకున్నవన్నీ జరుగుతాయి. జీవితం ఆనందంగా సాగుతుంది. ఈ సమయంలో అవివాహితులు తాము కోరుకున్న జీవిత భాగస్వామిని పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా, మీ పనిని అందరూ ప్రశంసిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు కూడా చేపడతారు.
2.కర్కాటక రాశి...
మే నెల కర్కాటక రాశివారికి చాలా బాగుంటుంది. ఈ సమయంలో ఈ రాశివారు బంపర్ లాటరీ కొట్టే అవకాశం ఉంది. గతంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే.. అవి మీ చేతికి అందుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. గతంలో ఎప్పుడో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు అందుకుంటారు.
3.ధనుస్సు రాశి...
ధనుస్సు రాశివారికి కూడా మే నెలలో అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు అడుగుపెడతారు. వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్థులకు కూడా జీతం పెరుగుతుంది.
4.కుంభ రాశి...
మే నెలలో కుంభ రాశివారి జీవితం అద్భుతంగా మారుతుంది. ఈ నెలలో ఈ రాశికి చెందిన అవివాహితులు ప్రేమలో పడే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి తగ్గిపోతాయి. బుధ గ్రహ సంచారంతో బంపర్ లాటరీ కొడతారు. అంటే.. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఊహించని మార్గం నుంచి మీ చేతికి డబ్బులు అందుతాయి.

