MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Mercury Transit: కర్కాటక రాశిలోకి బుధుడు.. ఈ 4 రాశులవారికి గుడ్ టైం స్టార్ట్!

Mercury Transit: కర్కాటక రాశిలోకి బుధుడు.. ఈ 4 రాశులవారికి గుడ్ టైం స్టార్ట్!

Mercury Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో బుధుడు, కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం వల్ల 4 రాశుల వారికి కెరీర్, ఆదాయం, తెలివితేటలు, మాటతీరులో మంచి మార్పులు రాబోతున్నాయి. మరి ఆ అదృష్ట రాశులేవో, అందులో మీ రాశి ఉందో తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Jul 29 2026, 04:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కర్కాటక రాశిలో బుధుడి సంచారం
Image Credit : Asianet News

కర్కాటక రాశిలో బుధుడి సంచారం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఆగస్టు 5న గ్రహాల రాకుమారుడైన బుధుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పు వల్ల కొన్ని రాశులవారికి మేలు జరగనుంది.  ఆగిపోయిన పనులు వేగవంతం కావడంతో పాటు, కొత్త అవకాశాలు, కెరీర్‌లో మంచి మార్పులు వస్తాయి. మాటతీరు మెరుగుపడుతుంది. మరి ఏ రాశులవారికి బుధ సంచారం శుభ ఫలితాలను ఇవ్వనుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మిథున రాశి
Image Credit : Getty

మిథున రాశి

మిథున రాశికి అధిపతి బుధుడు. అందుకే ఈ రాశివారికి బుధ సంచారం చాలా ప్రత్యేకం. చాలాకాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీ అభిప్రాయాలకు ఆఫీసులో విలువ పెరుగుతుంది. మీ మాటతీరే మీకు పెద్ద బలం అవుతుంది. వ్యాపారులకు కొత్త కస్టమర్లు వస్తారు. ఆన్‌లైన్‌లో పనిచేసే వారికి ఆదాయం పెరుగుతుంది. పాత పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. కుటుంబ సమస్యలు తీరుతాయి. తోబుట్టువుల సపోర్ట్ ఉంటుంది. ప్రేమ బంధాల్లో అపార్థాలు తొలగిపోతాయి.

35
కర్కాటక రాశి
Image Credit : our own

కర్కాటక రాశి

బుధుడు సంచరించేది కర్కాటక రాశిలోనే కాబట్టి.. ఈ రాశి వారి ఆలోచనలు, వ్యక్తిత్వంపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలనుకునేవారికి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో కొత్త వ్యూహాలు ఫలిస్తాయి. మార్కెటింగ్, మీడియా రంగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ జీవితంలో నమ్మకం బలపడుతుంది.

45
కన్య రాశి
Image Credit : Pixabay

కన్య రాశి

కన్య రాశికి కూడా బుధుడే అధిపతి కాబట్టి.. ఈ సంచారం వీరి ప్లాన్స్‌కు కొత్త ఊపునిస్తుంది. కెరీర్‌లో ఎదగడానికి మంచి అవకాశాలు వస్తాయి. పై అధికారుల నమ్మకాన్ని గెలుచుకుంటారు. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారంలో ముఖ్యమైన డీల్ ఫైనల్ కావచ్చు. ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాలు దొరుకుతాయి. పొదుపు చేయడంలో సక్సెస్ అవుతారు. కుటుంబంతో బంధాలు బలపడతాయి. పాత గొడవలు ముగిసే అవకాశం ఉంది. ప్రేమ బంధాలు మరింత బలపడతాయి. విద్యార్థులకు మంచి సమయం.

55
తుల రాశి
Image Credit : Pixabay

తుల రాశి

బుధ సంచారం తుల రాశివారికి కెరీర్, సామాజిక గుర్తింపు పరంగా కలిసొస్తుంది. చాలాకాలంగా పడుతున్న కష్టానికి ఫలితం దక్కుతుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. కొత్త పదవి లేదా బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ ప్లాన్స్ ముందుకు సాగుతాయి. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రుల సపోర్ట్ లభిస్తుంది. ప్రేమ, వైవాహిక జీవితంలో బంధం బలపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి దూరప్రాంతాల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కీలక విషయాల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది!
Related Stories
Recommended image1
Telugu Saying: పొట్టివాడిని పొడుగువాడు కొడితే, పొడుగువాడిని పోచమ్మ కొట్టిందట! సామెత అసలు కథ ఇదే!
Recommended image2
Psychology: సైకాలజీ ప్రకారం మనిషి ఎప్పుడు ఎక్కువగా అబద్ధాలు చెప్తాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved