Mercury Transit: మేషరాశిలోకి బుధుడు..ఈ మూడు రాశుల దశ తిరిగినట్లే..!
జోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు తరచుగా వాటి స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. మీన రాశిలో ఉన్న బుధుడు మేష రాశిలోకి అడుగుపెట్టాడు. దీని కారణంగా మూడు రాశులకు మేలు జరగనుంది.

వేదిక జోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం మరో గ్రహం నుంచి 30 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు, ఆ గ్రహాల ద్వారా ద్వాదశ రాజయోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం శని గ్రహం మీన రాశిలో ఉంది. నిన్నటి వరకు మీన రాశిలోని ఉన్న బుధుడు కాస్త ఈ రోజు మేష రాశిలోకి అడుగుపెట్టాడు. దీంతో శని, బుధుడు ఒకరికొకరు 30 డిగ్రీల దూరంలో ఉండి, ద్వాదశ రాజయోగాన్ని ఏర్పరుస్తాయి. ఈ పరిస్థితిలో బుధుడు, శని కొన్ని రాశులకు విపరీతమైన మేలు చేయనుండగా, మరి కొన్ని రాశులకు కష్టాలు కూడా తేనున్నారు. మరి, ఈ రెండు రాశుల ఆశీర్వాదంతో మేలు పొందే మూడు రాశులేంటో చూద్దాం..
telugu astrology
వృషభ రాశి
వృషభ రాశి వారికి, శని, బుధుడి ద్వారా ఏర్పడే ద్వాదశ యోగం శుభప్రదం. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విద్యారంగంలో లాభాలు ఉండొచ్చు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. పిల్లల నుండి సంతోషం కలుగుతుంది.
telugu astrology
మకర రాశి
మకర రాశి వారికి ద్వాదశ యోగం శుభప్రదం. స్నేహితులను కలుస్తారు. సంతోషంగా గడుపుతారు. ప్రయాణం చేయాలని అనుకోవచ్చు, అది మనసుకు ఆనందాన్నిస్తుంది. పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ ప్రణాళికలు లాభదాయకం కావచ్చు. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. పని పట్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
telugu astrology
కుంభ రాశి
కుంభ రాశి వారికి శని, బుధుడి ద్వాదశ యోగం శుభప్రదం. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు వ్యాపారంలో లాభాలు పొందవచ్చు. వ్యాపార విస్తరణకు కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఆస్తి సంబంధిత లాభాలు ఉండొచ్చు. కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది.