MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Dream Meaning: కలలో కొత్త దుస్తులు కనిపిస్తే అర్థం ఏంటి? నిజ జీవితంలో ఏమవుతుంది?

Dream Meaning: కలలో కొత్త దుస్తులు కనిపిస్తే అర్థం ఏంటి? నిజ జీవితంలో ఏమవుతుంది?

Dream Meaning: సాధారణంగా కొన్ని కలలు మనసులో ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ముఖ్యంగా కలలో కొత్త దుస్తులు కనిపిస్తే ఏమవుతుందనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. మరి దీని గురించి స్వప్న శాస్త్రం, జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : May 26 2026, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కలలో కొత్త దుస్తులు కనిపిస్తే అర్థం ఏంటి?
Image Credit : AI

కలలో కొత్త దుస్తులు కనిపిస్తే అర్థం ఏంటి?

మనిషి జీవితంలో కలలకు ప్రత్యేక స్థానం ఉంది. నిద్రలో కనిపించే కొన్ని కలలకు ప్రత్యేక సంకేతాలు, భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు ఉంటాయని స్వప్నశాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా కలలో కొత్త దుస్తులు కనిపించడం చాలా మందికి ఆసక్తిని కలిగించే విషయం. కొందరికి కొత్త బట్టలు కొనుగోలు చేస్తున్నట్లు కనిపిస్తే, మరికొందరికి కొత్త దుస్తులు ధరించినట్లు లేదా ఎవరైనా గిఫ్ట్ గా ఇచ్చినట్లు కలలు వస్తుంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం వాటి అర్థాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కొత్త మార్పులకు సంకేతం
Image Credit : Getty

కొత్త మార్పులకు సంకేతం

స్వప్న శాస్త్రం ప్రకారం కొత్త దుస్తులు కలలో రావడాన్ని జీవితంలో కొత్త మార్పులు, కొత్త ప్రారంభాలు, అదృష్టం, గౌరవం వంటి వాటికి సంకేతంగా భావిస్తారు. ఒక వ్యక్తికి కలలో కొత్త బట్టలు ధరించినట్లు కనిపిస్తే త్వరలో అతని జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అర్థం. ఉద్యోగంలో ప్రమోషన్, కొత్త అవకాశాలు, కుటుంబంలో శుభకార్యాలు లేదా ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వంటివి జరగవచ్చు. ముఖ్యంగా తెల్లని లేదా ప్రకాశవంతమైన రంగుల దుస్తులు కనిపిస్తే అది శుభ సూచికమని స్వప్న శాస్త్రం చెబుతోంది.

36
కొత్త దుస్తులు కొన్నట్లు కల వస్తే?
Image Credit : Generated by google gemini AI

కొత్త దుస్తులు కొన్నట్లు కల వస్తే?

కొత్త దుస్తులు కొనుగోలు చేస్తున్నట్లు కల వస్తే దానికి ప్రత్యేక అర్థం ఉంది. ఇది వ్యక్తి జీవితంలో కొత్త బాధ్యతలు లేదా కొత్త సంబంధాలు ఏర్పడబోతున్నాయని అర్థం. కొందరికి ఇది వివాహ యోగానికి సంకేతం కూడా కావచ్చు. అలాగే వ్యాపారం చేసే వారికి కొత్త అవకాశాలు లేదా లాభాలు వచ్చే సూచన కూడా కావచ్చని పండితులు చెబుతున్నారు.

46
కొత్త దుస్తులు గిఫ్ట్ గా ఇస్తే?
Image Credit : Getty

కొత్త దుస్తులు గిఫ్ట్ గా ఇస్తే?

కలలో ఎవరైనా కొత్త బట్టలు బహుమతిగా ఇస్తున్నట్లు కనిపిస్తే అది ఇతరుల నుంచి గౌరవం, సహాయం లేదా మంచి వార్తలు అందబోతున్నాయని సూచన. కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల మద్ధతు పెరగడం, సమాజంలో మంచి పేరు రావడం వంటి వాటికి ఇది సంకేతం కావచ్చు. ముఖ్యంగా పెద్దవాళ్లు కొత్త దుస్తులు ఇస్తున్నట్లు కనిపిస్తే అది అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు.

56
కొత్త దుస్తులు చిరిగిపోయినట్లు కనిపిస్తే?
Image Credit : Getty

కొత్త దుస్తులు చిరిగిపోయినట్లు కనిపిస్తే?

కలలో కొత్త దుస్తులు చిరిగిపోయినట్లు లేదా మురికిగా కనిపిస్తే అది కొన్ని ఆటంకాలు, ఆందోళనలు లేదా ఆర్థిక సమస్యలకు సంకేతంగా భావిస్తారు. అలాగే కొత్త బట్టలు వేసుకున్నప్పటికీ అసౌకర్యంగా అనిపిస్తే వ్యక్తి జీవితంలో మానసిక ఒత్తిడి లేదా అనిశ్చితి ఉందని సూచన.

66
దుస్తుల రంగును బట్టి అర్థం
Image Credit : Asianet News

దుస్తుల రంగును బట్టి అర్థం

దుస్తుల రంగులకు కూడా స్వప్న శాస్త్రంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. తెలుపు రంగు దుస్తులు ప్రశాంతత, శుభం, ఆధ్యాత్మికతను సూచిస్తాయి. ఎరుపు రంగు దుస్తులు శక్తి, ఉత్సాహం, ప్రేమ లేదా వివాహ సంబంధాలకు సంకేతం. పసుపు రంగు దుస్తులు అదృష్టం, సంపద, శుభవార్తలకు సూచన. అలాగే ఆకుపచ్చ రంగు అభివృద్ధి, ఆరోగ్యం, కొత్త అవకాశాలకు సంకేతం. నలుపు రంగు దుస్తులు కొన్ని సందర్భాల్లో జాగ్రత్త అవసరమనే హెచ్చరికగా పండితులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో ఈ 5 రాశులవారు టాప్! మీది ఏ రాశి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ నాలుగు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. గ్రహాల మార్పుతో ఈ వారం ఏ రాశికి కలిసొస్తుందంటే?
Related Stories
Recommended image1
Lucky Wallpapers: మీ మొబైల్‌లో ఈ వాల్‌పేపర్ ఉంటే అదృష్టం మీ వెంటే!
Recommended image2
June Astrology: 12 ఏళ్ల తర్వాత మహా సంయోగం.. జూన్‌లో 4 రాజయోగాలు, ఈ 4 రాశులకు పండగే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved