MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • May Astrology Predictions: మే నెలలో అదృష్టం అంతా ఈ 5 రాశులదే.. మట్టిని ముట్టినా బంగారమే!

May Astrology Predictions: మే నెలలో అదృష్టం అంతా ఈ 5 రాశులదే.. మట్టిని ముట్టినా బంగారమే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే నెలలో సూర్య, కుజుల సంచారం, బృహస్పతి శుభ ప్రభావం, బుధాదిత్య రాజయోగం వల్ల 5 రాశులవారికి విపరీతమైన లాభాలు రానున్నాయి. వారు పట్టిందల్లా బంగారం కానుంది. మరి ఆ అదృష్ట రాశులేవో, వారికి ఎలాంటి మేలు జరుగుతుందో చూద్దామా…

2 Min read
Author : Kavitha G
Published : Apr 22 2026, 10:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మేషరాశి ఆస్తి లాభం
Image Credit : Pixabay

మేషరాశి- ఆస్తి లాభం

మేష రాశివారికి మే నెలలో గ్రహాల సంచారం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుజుడు మే 11న మీన రాశి నుంచి తన సొంత రాశి అయినా మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశివారు ఆర్థిక లాభాలు పొందుతారు. ఆస్తి సంబంధిత ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషకరంగా సాగుతుంది. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మిథున రాశి- ఆర్థిక లాభాలు
Image Credit : Pixabay

మిథున రాశి- ఆర్థిక లాభాలు

మిథున రాశి వారికి మే నెల అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నెలలో లాభ స్థానంలో బుధాదిత్య రాజయోగం ఏర్పడటం వల్ల ఈ రాశివారికి ఆర్థిక లాభాలు కలుగుతాయి. కొన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు లాభాలు కురిపిస్తాయి. వ్యాపారాలలో కొత్త ఒప్పందాల ద్వారా లాభాలు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. 

Related Articles

Related image1
Ketu Effects: కేతువు చెడు దృష్టి.. ఈ 4 రాశులవారికి కష్టకాలం మొదలైనట్లే!
Related image2
Vastu Tips For Morning: ఉదయం నిద్ర లేవగానే అస్సలు చేయకూడని 5 పనులు ఇవే!
35
వృశ్చిక రాశి- విదేశీ ప్రయాణం
Image Credit : our own

వృశ్చిక రాశి- విదేశీ ప్రయాణం

వృశ్చిక రాశి వారికి మే నెలలో కుజ, సూర్య గ్రహాల సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. నూతన వాహనం, ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలు ఊపందుకుంటాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఊరట లభిస్తుంది.  

45
ధనుస్సు రాశి
Image Credit : AI Generated

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి మే నెలలో బృహస్పతి శుభ ప్రభావం వల్ల కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆర్థికంగా గణనీయమైన పురోగతి ఉంటుంది. ఈ సమయంలో ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతాయి. కుటుంబాలకు దూరంగా నివసించే వారు బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి మద్ధతు లభిస్తుంది.

55
కుంభ రాశి- భూమి కొనుగోలు
Image Credit : Pixabay

కుంభ రాశి- భూమి కొనుగోలు

కుంభ రాశి వారికి మే నెలలో ఊహించని లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. భూమి లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. రాజకీయ, ప్రభుత్వ రంగాల నుంచి లాభం పొందే సూచనలు బలంగా ఉన్నాయి. అయితే, నెలాఖరులో కాస్త ఖర్చులు పెరగవచ్చు. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.  

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image3
Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే లైట్ వెయిట్ మంగళసూత్రం డిజైన్లు
Related Stories
Recommended image1
Ketu Effects: కేతువు చెడు దృష్టి.. ఈ 4 రాశులవారికి కష్టకాలం మొదలైనట్లే!
Recommended image2
Vastu Tips For Morning: ఉదయం నిద్ర లేవగానే అస్సలు చేయకూడని 5 పనులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved