- Home
- Astrology
- Mars Venus Conjunction: కుంభరాశిలో కుజ, శుక్రుల కలయిక.. ఈ 3 రాశులవారి అదృష్టం రెట్టింపు కావడం పక్కా!
Mars Venus Conjunction: కుంభరాశిలో కుజ, శుక్రుల కలయిక.. ఈ 3 రాశులవారి అదృష్టం రెట్టింపు కావడం పక్కా!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్ణీత సమయంలో రాశులు, నక్షత్రాలు మారుస్తూ ఉంటాయి. అలా ఫిబ్రవరిలో ఒకే రాశిలో రెండు గ్రహాలు సంచరించనున్నాయి. ఆ రెండు గ్రహాల కలయిక వల్ల 3 రాశులవారికి అదృష్టం కలిసివస్తుంది. చిన్న కష్టానికి కూడా పెద్ద ఫలితం దక్కుతుంది.

కుంభ రాశిలో కుజ, శుక్రుల కలయిక
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరిలో అనేక గ్రహాల కలయిక జరగనుంది. ప్రధానంగా కుజుడు, శుక్రుడు ఒకే రాశిలో సంచరించనున్నారు. ధైర్యం, ఉత్సాహానికి కారకుడైన కుజుడు, భౌతిక సుఖాలు, అందానికి కారకుడైన శుక్రుడితో కలిసి కుంభరాశిలో శుభ యోగం ఏర్పరచనున్నాడు. జ్యోతిష్య విశ్లేషణల ప్రకారం ఫిబ్రవరి 6న శుక్రుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. 23న కుజుడు అదే రాశిలో సంచరిస్తాడు. ఆ సమయంలో ఈ రెండు గ్రహాల అరుదైన కలయిక జరుగుతుంది. దీనివల్ల 3 రాశులవారికి శుభ ఫలితాలు ఉన్నాయి. మరి ఏ రాశులవారికి మేలు జరుగుతుందో, వారి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మకర రాశి
కుంభరాశిలో కుజ, శుక్రుల కలయిక వల్ల మకరరాశి వారికి లాభం కలుగుతుంది. ఈ రాశి ధన స్థానంలో రెండు గ్రహాల కలయిక జరగడం వల్ల వీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. చేపట్టిన అన్నీ పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు చకచకా పూర్తవుతాయి. మీ మాట, ప్రతిభతో పెద్ద పనులను సైతం విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి కుజ, శుక్రుల కలయిక శుభప్రదంగా, సానుకూలంగా ఉంటుంది. ఈ రెండు గ్రహాల కలయిక ఈ రాశివారి అదృష్ట స్థానంలో జరగడం వల్ల వీరికి అదృష్టం బాగా కలిసివస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం వస్తుంది. కొత్త పనుల ప్రారంభానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి, సంతోషం పెరుగుతాయి. దాంపత్య జీవితం మరింత సంతోషంగా మారుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు దక్కుతాయి.
వృశ్చిక రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వృశ్చిక రాశి వారికి శుక్ర, కుజ గ్రహాల కలయిక చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ యోగం ఈ రాశివారి నాల్గవ ఇంట్లో ఏర్పడుతుంది. దానివల్ల ఈ రాశివారికి భౌతిక సుఖాలు, విలాసాలు పెరుగుతాయి. వాహన వ్యాపారం, రియల్ ఎస్టేట్‌లో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి వస్తుంది. పెట్టుబడులు లాభదాయకంగా మారుతాయి. నిరుద్యోగులకు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.

