ఒక్క రోజు ఓపిక పడితే ఈ 3 రాశుల దశ తిరిగిపోతుంది.. మామూలు అదృష్టం కాదు!
Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 13న కుజుడు.. తుల రాశిలో సంచరించనున్నాడు. ఈ సంచారం కొన్ని రాశులవారికి అదృష్టం తీసుకురానుంది. అప్పులు తీరడంతో పాటు వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. మరి ఆ రాశులేంటో చూద్దామా..

కుజుడి సంచారం
సెప్టెంబర్ 13న కుజుడు తుల రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం కొన్ని రాశుల వారికి కష్టాలను కలిగించినప్పటికీ, మరికొందరికి అదృష్టాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ సమయంలో సంపద పెరుగుతుంది. స్థలం, ఇల్లు, వాహనం కొనుగోలు చేయడం వంటి కోరికలు నెరవేరుతాయి. చిన్న చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితాలను ఇస్తాయి. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేయండి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి కుజుడి సంచారం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. చాలా కాలంగా ఉన్న ఆస్తి సంబంధ సమస్యలు తొలగిపోతాయి. భూమి కొనుగోలు చేసే అవకాశాలు ఏర్పడతాయి. కొత్త ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారంలో చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేతిలో డబ్బు నిల్వ ఉంటుంది. కొన్ని పెట్టుబడులలో ఊహించని లాభాలు వస్తాయి. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ సంచారం ఐశ్వర్యాన్ని, సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది. వ్యాపారంలో పోటీదారులను ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఇల్లు కొనే కల నెరవేరుతుంది. వాహన సౌకర్యం లభిస్తుంది. ఉద్యోగానికి సంబంధించి పదోన్నతి, బదిలీ వంటివి మీకు మేలు చేస్తాయి. విదేశీ సంబంధాల ద్వారా ఆర్థిక లాభం కలుగుతుంది. అన్నదమ్ముల ద్వారా ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబంలో బంధాలు మెరుగుపడుతాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి కుజుడి సంచారం మేలు చేస్తుంది. డబ్బు కూడబెట్టాలనే కల నిజమవుతుంది. అప్పుల్లో ఉన్నవారు అప్పులు తీర్చి స్వేచ్ఛ పొందుతారు. విదేశాల నుంచి డబ్బు రావడం పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు పెడితే ఊహించిన దానికంటే ఎక్కువ లాభం వస్తుంది. ఇంట్లో పెళ్లి వంటి శుభకార్యాలు జరుగుతాయి. ఐశ్వర్యంతో పాటు, ఆనందం కూడా వెల్లివిరుస్తుంది.